ETV Bharat / sukhibhava

Vitamin E Health Benefits In Telugu : చర్మం, జుట్టు ఆరోగ్యం కోసం విటమిన్-ఇ.. ఎక్కువైనా ప్రమాదమే! - విటమిన్ ఇ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు

Vitamin E Health Benefits In Telugu : విటమిన్​-ఇ శరీర ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా చర్మం,జుట్టు సంరక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే విటమిన్​-ఇ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. ఇంతకీ విటమిన్-ఇ వల్ల కలిగే ప్రయోజనాలేంటి? దాని సైడ్ ఎఫెక్ట్స్, రోజుకు ఎంత మొత్తంలో దీనిని తీసుకోవాలి వంటి విషయాలు ఈ కథనంలో చూద్దాం.

vitamin-e-health-benefits-in-telugu-vitamin-e-benefits-for-skin-and-hair

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 7:32 AM IST

Vitamin E Health Benefits In Telugu : ప్రస్తుత కాలంలో వాతావరణంలో భారీగా మార్పులు సంభవిస్తున్నాయి. కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతోంది. ఉష్ణోగ్రతలూ రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ప్రజల లైఫ్​ స్టైల్​లోనూ మార్పులొచ్చాయి. ఇదంతా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా జుట్టు, చర్మానికి ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విటమిన్-ఇ ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. నిత్యం విటమిన్​-ఇ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మానికి కలిగే లాభాలు..
Vitamin E Benefits For Skin : చర్మం ఆరోగ్యవంతంగా ఉండేందుకు విటమిన్​-ఇ తోడ్పడుతుంది. సోలార్​ రేడియేషన్ ద్వారా వచ్చే రాడికల్ స్కావెంజర్ నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. అందుకే చాలా స్కిన్​ కేర్​ ప్రొడక్ట్స్​ల​లో-ఇ విటమిన్​ను విరివిగా ఉపయోగిస్తారు. నిత్యం ఏదో విధంగా విటమిన్-ఇ తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుందని వైద్యనిపుణలు చెబుతున్నారు. దాంతోపాటు వయస్సు మీద పడటం ద్వారా వచ్చే ముడుతలు, మచ్చలు రాకుండా చేయవచ్చని వారు అంటున్నారు. అదేవిధంగా చర్మంపై వచ్చే వాపు, చికాకు నుంచి ఇ విటమిన్ ఉపశమనం కలిగిస్తుందని వెల్లడిస్తున్నారు.

జుట్టుకు కలిగే లాభాలు..
Vitamin E Benefits For Hair : జుట్టు ఎదుగుదలకు విటమిన్​-ఇ ఎంతగానో సాయపడుతుంది. జుట్టుకు ఆక్సిజన్, రక్తాన్ని సమృద్ధిగా అందించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. డాండ్రఫ్​ సమస్య నుంచి చాలా వరకు విముక్తి కలిగిస్తుంది. తలపై ఇన్​ఫ్లమేషన్ తగ్గించేందుకు తోడ్పడుతుంది. జుట్టును పొడిబారకుండా చేస్తుంది. జుట్టు నిగారింపు పెంచేందుకు, దృఢంగా ఉండేందుకు విటమిన్​-ఇ దోహదపడుతుంది.

vitamin-e-health-benefits-in-telugu-vitamin-e-benefits-for-skin-and-hair
విటమిన్ ఇ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు

విటమిన్​-ఇ ఎక్కువగా ఉండే పదార్థాలు..
Vitamin E Rich Foods : విత్తనాలు, హాజెల్ నట్స్, వేరుశనగ, పైన్ గింజలు, బాదంలో విటమిన్​-ఇ పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా.. పొద్దుతిరుగుడు నూనె, బచ్చలికూర, మామిడి, బొప్పాయి, కివీస్ పండ్లతో పాటు బ్రౌన్​ రైస్​, బార్లీలోనూ విటమిన్​ ఇ ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

విటమిన్​ ఇ రిచ్​ పుడ్స్​

శరీరానికి విటమిన్​-ఇ రాయడం..
Vitamin E Topical Application : అయితే విటమిన్​ 'ఇ'ని కేవలం ఆహారం రూపంలోనే కాకుండా.. శరీరానికి సైతం పూసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పొడిబారిన చర్మానికి విటమిన్​-ఇ పూయాలని వారు వెల్లడిస్తున్నారు. తలకు రాసుకుంటే దృఢమైన నిగారింపు జుట్టును సొంతం చేసుకోవచ్చని వారు అంటున్నారు.

విటమిన్ ఇ వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు

హెల్త్​ సప్లిమెంట్​గా విటమిన్​-ఇ..
Vitamin E Supplement : ప్లాంట్​​బెస్​డ్​ సప్లిమెంట్​ రూపంలోనూ విటమిన్​-ఇ తీసుకోవచ్చు. సింథటిక్ విటమిన్-ఇతో పోలిస్తే.. శరీరంలో ఇది తేలిగ్గా కలిసిపోతుంది. కాకపోతే మార్కెట్​లో దొరికే మంచి వేగాన్​ క్యాప్యూల్స్​ను వాడటం మంచిది. అయితే ఇవి కొద్ది కాలం వరకు మాత్రమే ప్రయోజనాలను చేకూరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎక్కువ కాలం క్యాప్యూల్స్​పై ఆధాపడవద్దని సూచిస్తున్నారు.

విటమిన్​ ఇ క్యాప్యూల్స్

రోజుకు ఎంత మొత్తం విటమిన్​-ఇ అవసరం..
Vitamin E Rich Foods : సాధారంగా పెద్దలకైతే రోజుకు 15మిల్లిగ్రాముల విటమిన్​-ఇ అవసరం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వివిధ రకాల వ్యక్తుల శరీరం ఆధారంగా ఈ లెక్కలు మారే అవకాశం ఉందని వారు వెల్లడిస్తున్నారు. అందుకే వైద్యులను సంప్రందించి రోజుకు ఎంత మొత్తంలో విటమిన్-ఇ తీసుకోవాలో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది?
Vitamin E Side Effects : విటమిన్-ఇను మరీ ఎక్కువగా తీసుకున్న సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తాయని అంటున్నారు వైద్య నిపుణులు. అవి శరీరానికి నష్టం కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. కడుపు నొప్పి, డయేరియా, వికారం, చర్మం ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అవసరం ఉన్న మేరకే విటమిన్​-ఇ తీసుకోవాలి సూచిస్తున్నారు.

Stroke Deaths worldwide : 2050 నాటికి కోటి బ్రెయిన్​ స్ట్రోక్​ మరణాలు.. ఆ దేశాల్లోనే ఎక్కువ!

Benefits of Almonds in Telugu : ఈ డ్రైఫ్రూట్ తింటే బరువు తగ్గుతారు.. ఎలా తిన్న ఏం కాదు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.