ETV Bharat / sukhibhava

మీరు నాన్ వెజ్​ తినరా? ప్రొటీన్స్​ కోసం ఏం తీసుకోవాలో తెలుసా?

Vegetarian Protein Sources : మీరు మాంసం తినడం బంద్​ చేశారా..? అయితే శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లు అందడం లేదని భయపడుతున్నారా? నో వర్రీ..! ఈ ఆహారం తింటే ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి!

Vegetarian Protein Sources
Vegetarian Protein Sources
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 1:35 PM IST

Vegetarian Protein Sources Instead of Meat: శరీర నిర్మాణంలో ప్రొటీన్ల పాత్ర అత్యంత కీలకం. అయితే.. ప్రొటీన్లు మాంసాహారంలోనే ఎక్కువగా ఉంటాయని చాలా మంది భావిస్తారు. శాకాహారం తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు లభించవని అనుకుంటారు. అయితే ఇది ఏ మాత్రం నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్నిరకాల శాకాహారాలు తినడం వల్ల కూడా శరీరానికి అవసరమయ్యే మాంసకృత్తులు లభిస్తాయని అంటున్నారు.

మొత్తం 5 రకాల ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో పుష్కలంగా ప్రొటీన్ ఉంటుందని చెబుతున్నారు. అవి కూడా మనకు అందుబాటులో ఉండేవే! మరి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వైట్​ రైస్​- బ్రౌన్​ రైస్​! ఏది మంచిది?

చిక్కుళ్లు: బీన్స్ జాతి (చిక్కుళ్లు, బఠానీలు, శనగలు..) కూరల్లో ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో ప్రొటీన్లతో పాటు ఐరన్, ఫైబర్, ఇతర పోషకాలు అత్యధికంగా ఉంటాయి. దీని వల్ల శరీరానికి చాలా మేలు చేకూరుతుంది. సాధారణంగా.. వీటిని కూరలుగా వండుకుని తింటారు. దాంతో పాటు సూప్‌లు, సలాడ్‌లుగా చేసుకుని తింటారు. ఎలా తీసున్నప్పటికీ శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్​ దండిగా లభిస్తాయి.

గింజలు : బాదం, వేరుశెనగ, గుమ్మడి గింజలు, ఇంకా చియా గింజల్లో ప్రొటీన్‌లు అధికంగా ఉంటాయి. వీటిని స్మూతీస్, పెరుగు లేదా ఓట్‌మీల్‌తో తీసుకోవచ్చు. టేస్ట్​కు టేస్ట్.. ప్రొటీన్​కు ప్రొటీన్ అందుతాయి.

నిద్ర రావట్లేదా? - అల్లం, అశ్వగంధతో డీప్​ స్లీప్!

ధాన్యాలు: క్వినోవా, బ్రౌన్ రైస్, హోల్-వీట్ బ్రెడ్ కూడా అధిక ప్రొటీన్​ కలిగి ఉంటాయి.

సోయా ఉత్పత్తులు: సోయా బీన్, సోయా ఉత్పత్తుల్లో ప్రొటీన్లు అధిక మోతాదులో ఉంటాయి. ప్రొటీన్లు పెద్ద మొత్తంలో లభించే శాకాహార పదార్థాల్లో దీనిని అద్భుతమైనదిగా చెప్పుకుంటారు. సోయాబీన్‌తో చేసిన చాలా రకాల పదార్థాలు టోఫూ, సోయా మిల్క్, సోయా బీన్స్, సోయా ప్రొటీన్ పౌడర్ వంటివి కూడా తీసుకోవచ్చు.

పాల ఉత్పత్తులు: ఇక పాల గురించి అందరికీ తెలిసిందే. పాలు, పెరుగు, పన్నీర్​, జున్ను వంటి పాల ఉత్పత్తులు కూడా మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. వీటిల్లో కూడా అధిక మోతాదులో ప్రొటీన్లు ఉంటాయి. రోజూ వీటిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకూ అధిక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

గ్యాస్ట్రిక్, ఎసిటిడీ - ఈ యోగ ముద్రతో జీర్ణ సమస్యలన్నీ ఖతం!

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? :

  • 2019లో "The American Journal of Clinical Nutrition"లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. దీని ప్రకారం.. సోయా ఉత్పత్తులు, పప్పులు, గింజలు.. మాంసం ఆధారిత ప్రొటీన్‌లకు సమానమైన పోషణను అందిస్తాయి.
  • భారతీయ వైద్య పరిశోధన మండలి (ICMR) 2017 అధ్యయనం ప్రకారం.. పప్పులు, ధాన్యాలు, పాలు వంటి శాకాహార వనరుల నుంచి ప్రొటీన్ పొందడం సాధ్యమే అని తేలింది.
  • పప్పులు, ధాన్యాలను సరైన క్రమంలో తీసుకోవడం ద్వారా ప్రొటీన్‌ను పొందవచ్చని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ 2016లో స్పష్టం చేసింది.

బీకేర్​ఫుల్ : ఈ ఆహార పదార్థాలు తిన్న తర్వాత అస్సలు నీరు తాగకండి! - లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

మీ పిల్లలు ఏడ్చినప్పుడు చాక్లెట్స్ కొనిపిస్తున్నారా? - అయితే వారి ఆరోగ్యాన్ని హరిస్తున్నట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.