Best Foods to Increase Lifetime : ప్రస్తుత ఉరుకులు పరుగుల ప్రపంచంలో చాలామంది తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. పని హడావుడిలో పడి శరీరానికి ఏం కావాలో, ఏం చేస్తే ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటామో అనే విషయాన్ని మర్చిపోతున్నారు. నిజానికి మన రోజూవారి జీవన విధానం, ఆహారశైలిలో మార్పులు చేస్తే మనిషి తన జీవితకాలాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. కొన్ని రకాల ఆహారాలని(Foods) తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం బతకొచ్చని చెబుతున్నారు. నవంబర్ 20న నేచర్ ఫుడ్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఇందుకోసం UK బయోబ్యాంక్ నుంచి డేటాను ఉపయోగించారు. ఈ అధ్యయనంలో ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆయుష్షు పెంచుకోవచ్చో సూచించారు. దీని ప్రకారం కొన్ని రకాల ఆహారాలని తీసుకుంటే పురుషులు, మహిళలు మరో 10 ఏళ్లు జీవితకాలం పెంచుకోవచ్చు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
These Foods Increase Life Expectancy 10 Years : ఈ అధ్యయనంలో ఆరోగ్యకరమైన అలవాట్లు ఫాలో అయితే.. జీవిత కాలాన్ని గణనీయంగా పెంచుకోవచ్చం టున్నారు. అంటువ్యాధి వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని కాపాడుకోవచ్చని తేలింది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల నుంచి కొన్ని ఆరోగ్యకర ఆహార విధానాలకు మారడంతో ఆయుష్షును మరో పదేళ్లు కాపాడుకోవచ్చు. ఈ అధ్యయనం ప్రకారం.. ఒక మహిళ 40 సంవత్సరాల వయసులో తన ఆహార అలవాట్లు మార్చుకోవడం ప్రారంభిస్తే తన జీవిత కాలాన్ని 8.6 సంవత్సరాలు పెంచుకోవచ్చు. అలాగే 40 సంవత్సరాల వయసు ఉన్న ఒక పురుషుడు తన ఆయుష్షు 8.9 సంవత్సరాలు పెంచుకోవచ్చని అధ్యయనంలో వెల్లడైంది.
అలర్ట్ - మీరు ఈ ఆహారం తింటున్నారా? - ఆ సామర్థ్యం డౌన్!
అంతేకాదు.. దీర్ఘాయువును ప్రోత్సహించే ఆహారాన్ని అనుసరించడం వల్ల పురుషులు తమ జీవితకాలాన్ని 10.8ఏళ్లు, మహిళలు తమ ఆయుష్షును 10.4 సంవత్సరాలు పెంచుకోవచ్చని ఆధ్యయనంలో తేలింది. దీంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా.. తృణధాన్యాలు, గింజలు, పండ్లను తీసుకోవాలి. అలాగే చక్కెర పానీయాలు, మాంసాహారాలు, శుద్ధి చేసిన ధాన్యాలకు వీలైనంత ఎక్కువ దూరంగా ఉండాలి. ఇలా చేసినప్పుడు మీ బాడీలో కలిగే మార్పును మీరే గమనిస్తారని పరిశోధకులు సూచిస్తున్నారు.
సాధారణంగా ఆడవాళ్ల కన్నా మగవారికి ఎక్కువ శక్తి అవసరం. గర్భిణీలు, బాలింతలకు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం అవసరం. అయితే వ్యాయామం చేసే వారికి ఎక్కువ క్యాలరీలు అవసరం అవుతాయి. కాబట్టి మనం చేసే పని, అలవాట్లను బట్టి కావాల్సిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. సమతుల ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని నివారించడం సహా పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చు. ఇలా పైన పేర్కొన్న విధంగా సరైన ఆహారాన్ని తీసుకుంటే మీరు మరో పదేళ్లు జీవితకాలాన్ని పెంచుకున్నవారవుతారు.
ఆరోగ్యంగా ఉండాలా? మీ ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే!
Best Fiber Foods In Telugu : ఫైబర్ ఫుడ్‌తో గుండె జబ్బులు, క్యాన్సర్ దూరం!