ETV Bharat / sukhibhava

గుండెపోటు లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఇలా చేయండి!

Symptoms Of Heart Attack : ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుతో మృతి చెందుతున్నారు. గుండెపోటు వస్తే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఆ సమయంలో ఏం చేయాలి??

Symptoms Of Heart Attack
Symptoms Of Heart Attack
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 11:09 AM IST

Symptoms Of Heart Attack : ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అత్యధిక మరణాల్లో.. గుండె జబ్బుల వాటా గణనీయంగా ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు కారణం.. గంటల తరబడి ఒకేచోట కూర్చొని పనిచేయడం.. శారీరక శ్రమ లేకపోవడం.. మారిన జీవన శైలి.. వంటివి ప్రధాన కారణాలుగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గుండెను పదిలంగా చూసుకోవాలంటున్నారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు.. ఆహారపు అలవాట్లు, జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తున్నారు. గుండెలో ఏమైనా సమస్యలు ఉన్నట్లైతే మన శరీరం నుంచి కొన్ని సంకేతాలు అందుతాయి. వాటిని పరిశీలించి అప్రమత్తం కావడం మంచిది. గుండె నొప్పి లేదా గుండెపోటు వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ? ఇటువంటప్పుడు ఏం చేయాలి ? ఆ సమయంలో ఎటువంటి జాగ్రత్తలను తీసుకుంటే ప్రాణాలను కాపాడవచ్చు? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

గుండెపోటు లక్షణాలు :

  • గుండె నొప్పి అనేది ఛాతి ఎడమవైపు భాగంలో వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే.. ఒక బలమైన వస్తువును గుండెపై ఉంచినట్లు అనిపిస్తుంది.
  • ఇంట్లో ఏసీ, ఫ్యాన్‌ ఆన్‌లో ఉన్నా కూడా విపరీతమైన చెమటలు పట్టడం. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • వికారం లేదా వాంతులు వచ్చినట్టుగా అనిపిస్తుంది.
  • విశ్రాంతి తీసుకుంటున్నా కూడా.. తీవ్రమైన అలసటగా ఉండడం
  • మూర్ఛపోయినట్లు లేదా స్పృహ తప్పినట్లు అనిపిస్తుంది.
  • గుండె పరుగెత్తుతున్నట్టు కొట్టుకుంటుంది లేదంటే.. అలా అనిపిస్తుంది.
  • ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

అంబులెన్స్‌కి కాల్ చేయండి :
ఇలాంటి లక్షణాలు కనిపించినా.. చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ.. అలా చేయొద్దని అంటున్నారు నిపుణులు. పైన చెప్పిన లక్షణాలలో ఏవైనా కనిపిస్తే.. అది గుండెపోటుగా భావించాలని చెబుతున్నారు. అవకాశం ఉంటే.. తోడుగా ఆసుపత్రికి వెళ్లాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే.. అంబులెన్స్‌కి కాల్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

క్యాన్సర్​ను తరిమికొట్టే - అద్భుతమైన ఫుడ్! - మీ డైట్​లో భాగం చేసుకోవాల్సిందే!

"గోల్డెన్ అవర్"​ చాలా ముఖ్యం :
హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన మొదటి గంట సమయాన్ని‘గోల్డెన్ అవర్’ అంటారు. ఆ సమయంలో రోగికి ఎలాంటి వైద్యమూ అందకపోతే.. ప్రమాదం ఇబ్బంది పెరుగుతుంది. ముందుగా అంబులెన్స్​కు ఫోన్ చేసి.. అది వచ్చేలోగా CPR (Cardiopulmonary Resuscitation) చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రథమ చికిత్స బాధితుల ప్రాణాలను చాలా వరకు కాపాడుతుందని అంటున్నారు.

ఇందుకోసం.. ముందుగా హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన వ్యక్తిని వెల్లకిలా నేలపై పడుకోబెట్టాలి. వారి ఛాతి మీద పూర్తిగా చాచిన చెయ్యిపెట్టాలి.. దానిపై రెండో చెయ్యి కూడా పెట్టి బలంగా ఒత్తుతూ(Pressing) ఉండాలి. ఆగకుండా వేగంగా కనీసం 15 సార్లు ఇలా చేసి.. ఆ తర్వాత నోట్లో నోరు పెట్టి శ్వాస‌ అందించాలి. మళ్లీ ఛాతి మీద ఒత్తుతూ ఉండాలి. ఇలా ఆసుపత్రికి చేరే వరకూ చేస్తూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల గుండె పూర్తిగా ఆగిపోకుండా తిరిగి కొట్టుకునే అవకాశం ఉంటుంది.

Note : ఈ వివరాలన్నీ ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం అందించినవి. వైద్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? - ఈ ఆహారాలు ఔషధం!

మీరు ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - మీ పేగుల్లో విషం నింపుతునట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.