అవాంఛిత రోమాలు వస్తున్నాయంటే టెస్టోస్టిరాన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయేమో పరీక్ష చేయించుకోవాలి. తగ్గడానికి మాత్రలు వాడాలి. అలానే థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి. అది నియంత్రణలోనే ఉంటూ బరువు పెరుగుతుంటే.. పీసీఓడీ మళ్లీ మొదలైందని గుర్తించాలి. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉందో చెక్ చేయించుకోండి. పీసీఓడీ అనేది జీవితకాలం ఉండే ఒక రకమైన ఆరోగ్య సమస్య.
ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే సమస్య నియంత్రణలోకి వస్తుంది. అలాగే ఆరు నెలలకోసారి థైరాయిడ్ పరీక్ష తప్పనిసరి. టెస్టోస్టిరాన్ తగ్గడానికి మాత్రలు వాడితే ఇప్పటి నుంచి రోమాలు రావడం తగ్గుతుంది. ఇప్పటికే వచ్చిన అవాంఛిత రోమాలకు లేజర్ చికిత్స తీసుకోండి. శరీరంలో విటమిన్లు బి1, బి6, సూక్ష్మ పోషకాలు తగ్గినప్పుడు... అలసటా, చిరాకు లాంటివి కలగడం సహజం. ఒక్కోసారి హార్మోన్ల అసమతుల్యత ఇందుకు కారణం కావొచ్చు. కాబట్టి వైద్యుల సూచనలతో మల్టీ విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లను తీసుకోండి. కడుపు నొప్పికి కారణం తెలుసుకునేందుకు ఓసారి గైనకాలజిస్ట్‌ను కలవండి. కడుపులో ఎండోమెట్రియాసిస్, కణతులు ఉంటే పరీక్షల ద్వారా గుర్తించి, అనుగుణంగా చికిత్స అందిస్తారు.
ఇదీ చదవండి: విపరీతమైన తలనొప్పి.. మైగ్రేనా లేక కరోనానా?