ETV Bharat / sukhibhava

చిన్న మార్పులతో మీ ఆరోగ్యం భేష్!

ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. మనం నిత్యం చేసే పనుల్లో చిన్న చిన్న మార్పులు చేస్తే మెరుగైన ఆరోగ్య ఫలితాలు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Good Health tips
చిన్న మార్పులతో ఆరోగ్యం భేష్!
author img

By

Published : Nov 5, 2020, 12:54 PM IST

ఆరోగ్యం కోసం పెద్ద పెద్ద మార్పులే చేసుకోవాలనేమీ లేదు. చిన్నవైనా ఎంతో మేలు చేస్తాయి. అలాంటి కొన్నింటి గురించి తెలుసుకుందాం.

భోజనంతో పాటు ఓ పండు

రోజుకు ఐదు సార్లు పండ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. దీన్ని గుర్తుంచుకోవటం కష్టమనుకుంటే భోజనం, టిఫిన్‌ చేసినప్పుడు తప్పకుండా ఏదో ఒక పండు తినటం అలవాటు చేసుకోండి. దీని వల్ల కనీసం మూడు సార్లయినా పండ్లు తిన్నట్టు అవుతుంది. పండ్లలోని పీచు, యాంటీఆక్సిడెంట్లు, పోషకాల వంటివి గుండెజబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు తగ్గేలా చేస్తాయి.

సంచి బరువు కాస్త తగ్గినా..

వీపులకు, భుజాలకు తగిలించుకునే సంచులను ఎప్పటికప్పుడు తరచి చూసుకోండి. అవసరం లేనివాటిని వెంటనే తీసేయండి. ఇలాంటి వాటి బరువు మన శరీర బరువులో 10% కన్నా మించకుండా చూసుకోవటం మంచిది. ఫలితంగా మెడ, వెన్ను, భుజం నొప్పుల బారినపడకుండా కాపాడుకోవచ్చు.

చక్కెర చిటికెడు తగ్గించి..

చక్కెరతో జీవక్రియలు, మెదడు పనితీరు మందగిస్తాయి. దీన్ని ఒకింత తగ్గించి పెరుగు, మజ్జిగ వంటి ప్రొబయోటిక్‌ పదార్థాలను మరింత పెంచుకోవటం మంచిది. ఎందుకంటే చక్కెర, శుద్ధిచేసిన ధాన్యాలతో చేసిన ఉత్పత్తులను తగ్గించటంతో పాటు మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే ప్రొబయోటిక్‌ పదార్థాలను తీసుకుంటే ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతున్నాయన్నది నిపుణుల సూచన.

ప్రయాణాల్లో ఒకింత విరామం

ఎక్కువసేపు ప్రయాణాలు చేస్తుంటే మధ్య మధ్యలో విరామం తీసుకోవటం, అటూఇటూ నాలుగైదు అడుగులు వేయటం ఎంతైనా అవసరం. దీంతో కాలి సిరల్లో రక్తం గడ్డలు ఏర్పడకుండా చూసుకోవచ్చు. ఒక కాలును వెనక్కి జరిపి, రెండో కాలును చిన్నపాటి ఎత్తు మీద పెట్టి, శరీరాన్ని ముందుకు సాగదీసే ప్రయత్నం చేసినా మంచిదే. కూర్చున్నప్పుడు కదలకుండా ఉండిపోయిన తొడ, వీపు కండరాలు సాగుతాయి. ఈ చిన్న చిన్న మార్పులతో దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:అరెస్టు తర్వాత అర్ణబ్ తొలి రాత్రి గడిపింది అక్కడే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.