ETV Bharat / sukhibhava

Reasons For Regular Stomach Pain : తరచూ కడుపు నొప్పి బాధిస్తోందా? అయితే వీటికి దూరంగా, వాటికి దగ్గరగా ఉండాల్సిందే! - reasons for regular stomach pain in telugu

Reasons For Regular Stomach Pain In Telugu : కడుపు నొప్పి చాలా మందికి వస్తూ ఉంటుంది. దీనికి వయసుతో సంబంధం లేదు. అయితే.. కొందరికి మాత్రం తరచూ వస్తుంది. మరి.. ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Reasons For Regular Stomach Pain In Telugu Full Details Here
How To Reduce Stomach Pain
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 4:06 PM IST

Reasons For Regular Stomach Pain In Telugu : కొందరిలో కడుపు నొప్పి అనేది సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. కొన్ని కడుపు నొప్పులు అనారోగ్యం వల్ల వస్తే.. మరికొన్ని మనం తినే ఆహారాల వల్ల కూడా వస్తూ ఉంటాయి. ఇంకొన్ని కడుపు నొప్పులకైతే కారణాలు కూడా ఉండవు. అసలు ఇంతకీ కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? కడుపు నొప్పి వచ్చిన సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కొంతమందిని అకస్మాత్తుగా కడుపు నొప్పి బాధిస్తూ ఉంటుంది. అసలు ఈ పొట్టలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. ఉదరంలో లేదా పొట్ట కింది భాగంలో ఇలా వివిధ రకాలుగా కడుపు నొప్పి బాధిస్తుంది. కడుపు నొప్పి అంటే పొట్ట భాగంలో ఏదో ఒక చోట నొప్పి రావడంగా చెబుతారు. కొన్నిసార్లు నొప్పి వచ్చిన చోటే ఉండిపోవచ్చు.

కడుపు నొప్పి రకాలు!
కడుపు నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. దీన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి అప్పర్ జీఏ సిస్టమ్, రెండు లోవర్ జీఏ సిస్టమ్, మూడోది హెపటోబిలియన్. అప్పర్ జీఏ సిస్టమ్ అంటే.. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల పొట్టలో చాలా మంటగా అనిపించడం. అలాగే ఆహారం తీసుకున్నాక నొప్పి పెరగుతుంది. ఇలా ఆహారానికి సంబంధించిన నొప్పులన్నింటికీ ఎండోస్కోపీ లాంటి పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం డాక్టర్​ సలహాల మేరకు మందులు వాడాల్సి ఉంటుంది.

తరచూ వస్తుంటే లైట్​గా తీసుకోవద్దు!
కొన్నిసార్లు కడుపు నొప్పి శరీరంలోని మిగిలిన ప్రాంతాలకూ వ్యాపించవచ్చు. కాలేయం, క్లోమంలో ఇన్ఫెక్షన్ వచ్చినా, వాపు వచ్చినా, రక్త ప్రసారానికి అంతరాయం ఏర్పడినా కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. కడుపు నొప్పి ఏదో ఒక సందర్భంలో వస్తే మామూలు నొప్పిగా భావించాలి. అదే నొప్పి తరచూ వస్తే మాత్రం తేలిగ్గా తీసుకోకూడదు.

ఒత్తిడి తగ్గించుకోవాలి!
ఆహారం తిన్నప్పుడు కడుపు నొప్పి రావడానికి పిత్తాశయంలో రాళ్లు ఉండటం ఒక కారణంగా చెప్పవచ్చు. అల్ట్రా సౌండ్ పరీక్షలో పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయా లేదా అనేది తెలిసిపోతుంది. లోవర్ జీఐ అనేది మలబద్ధకం వల్ల ఏర్పడుతుంది. అలాంటప్పుడు వైద్యులు సూచించే పరీక్షల ద్వారా పెద్ద పేగులో సమస్యల గురించి తెలుసుకోవాలి. ఒక్కోసారి ఆందోళన పడటం వల్ల కూడా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలి. సరైన సమయంలో ఆహారం తినాలి, కంటికి సరిపడా నిద్రపోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ ఫుడ్స్​కు దూరం!
పొట్ట ఉదర భాగంలో ఏ అవయవానికి ఇన్ఫెక్షన్ సోకినా ఇది కడుపు నొప్పికి దారితీస్తుంది. స్పైసీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, ఎక్కువ కాలం నిల్వ ఉండి చెడిపోయిన ఆహారాలు తినడం మొదలైనవి కూడా కడుపు నొప్పికి కారణం అవుతాయి. పొట్టలో నొప్పి అనిపించినప్పుడు జ్వరం, వాంతి, వాపు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మహిళల్లో నెలసరి వచ్చినప్పుడు కూడా తీవ్రమైన కడుపు నొప్పి బాధిస్తూ ఉంటుంది.

పోషకాహారాన్ని తీసుకోవాలి!
కొన్ని రకాల కడుపు నొప్పులను తగ్గించుకునేందుకు మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు డాక్టర్లు. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులను సరైన మోతాదులో తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయడం ఉత్తమం. మంచి డైట్ తీసుకోవడమే కాకుండా సరైన మోతాదులో నీళ్లు తాగుతూ ఉండాలి. కడుపు నొప్పితో పాటు జ్వరం లాంటి ఇతర లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే డాక్టర్​ను సంప్రదించడం చాలా అవసరం అని గుర్తుంచుకోండి.

తరచూ కడుపు నొప్పి బాధిస్తోందా?

Raw Turmeric Health Benefits : ప‌చ్చి పసుపు తింటే ఎన్ని లాభాలో.. దీర్ఘకాలిక రోగాలూ నయం!

Why Do We Feel Relax After Sex : సెక్స్ చేసిన తరువాత బాడీకి ఫుల్ రిలీఫ్​.. ఎందుకో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.