ETV Bharat / sukhibhava

Pregnancy Diet In Telugu : పండంటి బిడ్డకు జన్మనివ్వాలా?.. ఈ ఫుడ్​ డైట్ ఫాలో అయిపోండి!

Pregnancy Diet In Telugu : బిడ్డకు జన్మవ్వడం అనేది మహిళకు మరో జన్మలాంటిది. అందుకే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే.. గర్భిణీలు సరైన పోషకాహాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జింక్​ కంటెంట్​ బాగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. మరి ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా?

Zinc Rich Food For Expecting Moms
Pregnancy Diet
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 8:07 AM IST

Pregnancy Diet In Telugu : మాతృత్వం అనేది ఒక మధురానుభూతి. ఒక మహిళ మరో జీవికి జన్మ నివ్వడం వల్ ఆమె జీవితం పరిపూర్ణమవుతుంది. అందుకే మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన పౌష్టికాహారాన్ని.. ఒక క్రమ పద్ధతిలో భుజించాలి.

శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గర్భంలోని శిశువు సరిగ్గా పెరగాలంటే.. మహిళలు తమ ఆహారంలో జింక్​ కంటెంట్​ సరైన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. జింక్ అనేది కణ విభజన, ప్రోటీన్​ సంశ్లేషణ సహా పిండం పెరుగుదలలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది.

జింక్​ కంటెంట్​..
చాలా మంది మహిళలకు గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియదు. అందువల్ల వారిలో జింక్​ సహా ఇతర సూక్ష్మపోషకాలు లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల తల్లితోపాటు.. కడుపులోని బిడ్డకు కూడా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి సమస్య ఏర్పడకుండా ఉండాలంటే.. గర్భిణీలు రోజుకు కనీసం 12mg మేర జింక్ కంటెంట్ ఉన్న ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఇప్పుడు జింక్ కంటెంట్ అధికంగా ఉండే.. ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తోటకూర :
Amaranth Health Benefits : ఇందులో ఫైబర్​, ప్రొటీన్, మెగ్నీషియం, మాంగనీస్​, ఐరెన్, జింక్​ ఉంటాయి. దీనిని వివిధ రకాల పద్ధతుల్లో వండుకుని తింటే గర్భిణీలకు ఎంతో మంచిది.

పప్పు ధాన్యాలు :
Lentils Health Benefits : మనకు పెసలు, మినుములు, ఉలవలు, కంది సహా వివిధ రకాల పప్పులు లభిస్తాయి. వీటిలో జింక్ సహా పలు మూలకాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని గర్భిణిలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

బాదం పప్పు :
Almonds Health Benefits : బాదం పప్పులో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని మీరు చిరుతిండిగా తీసుకోవచ్చు. రాత్రిపూట వీటిని నీటిలో నానబెట్టి, ఉదయం తింటే ఎంతో బాగుంటుంది.

జీడిపప్పు :
Cashews Health Benefits : ఈ జీడిపప్పులో పైబర్​, ప్రొటీన్​, మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో కాపర్, జింక్​, మెగ్నీషియం, ఐరన్​, ఫాస్పరస్​ లాంటి ఎన్నో మంచి మూలకాలు కూడా లభిస్తాయి.

నువ్వులు :
Sesame Seeds Health Benefits : నువ్వుల్లో కాల్షియం, ప్రొటీన్, ఫైబర్​ సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని సలాడ్స్​, బ్రెడ్స్​లో కలుపుకుని తినాలి. లేదంటే బెల్లం ఉండలు చేసుకుని ప్రతిరోజూ చిరు తిండిగా ఉపయోగించాలి. నువ్వుల నూనెను ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించాలి. దీని వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యం మెరుగువుతుంది.

గార్డెన్ క్రెస్ విత్తనాలు :
Garden Cress Seeds Health Benefits : క్యాబేజీ, కాలీఫ్లవర్​లతో పాటు బ్రాసికేసి కుటుంబానికి చెందిన ఒక రకమైన మొక్క విత్తనాలే 'గార్డెన్ క్రెస్'. కొందరు వీటిని అలీవ్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి గర్భిణీల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలు :
Sunflower Seeds Health Benefits : సూర్యకాంత పుష్పం నుంచి వచ్చిన విత్తనాలనే.. కొందరు పొద్దుతిరుగుడు విత్తనాలు అంటారు. వీటిలో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే గుండె మంటను తగ్గిస్తాయి.

పన్నీర్​​ :
Paneer Health Benefits : పూర్తిగా శాఖాహారం తీసుకునే వ్యక్తులకు (వీగన్స్)కు పన్నీర్​ అనేది చాలా మంచి ఆప్షన్ అవుతుంది. దీనిలో ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ​ఇది మహిళలకు ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ప్రసవం చక్కగా జరగాలంటే..
Zinc Rich Food Health Benefits : ఆరోగ్య నిపుణుల ప్రకారం, గర్భిణీలకు అవసరమైన అత్యంత ముఖ్యమైన ఖనిజం జింక్​. వాస్తవానికి శరీరంలోని ఎంజైమ్స్ అన్నీ​ సరిగ్గా పనిచేయాలంటే.. ఈ జింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి.

జింక్​ మనం తీసుకునే ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి సులువుగా జీర్ణం కావడానికి దోహదపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీర కణజాలాలు బాగా వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. ఒకవేళ ఏదైనా శరీర భాగాలు దెబ్బతింటే.. వాటిని మరమ్మత్తు చేయడంలో సహకరిస్తుంది. అందుకే గర్భంతో ఉన్న మహిళలు.. వైద్యుల సూచన మేరకు తగినంత మోతాదు జింక్ కంటెంట్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. అప్పుడు ప్రసవం సజావుగా జరుగుతుంది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉంటారు.

Best Ways To Build Trust In Parent Child Relationship : పిల్లల పెంపకంలో... అతి ముఖ్యమైన ఈ 6 విషయాలు మీకు తెలుసా..?

Health Benefits Of Seeds : బరువు తగ్గాలా?.. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలా?.. అయితే ఈ గింజల్ని ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.