గర్భిణీలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. పుట్టబోయే బిడ్డ ఎలాంటి లోపానికి గురికాకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అయితే ఆమె తీసుకునే తిండి పదార్థాల్లో కరివేపాకు రోటీ ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచింది. దీన్ని ఎలా తయారు చేయాలంటే..
కావాల్సిన పదార్థాలు
మల్టీ గ్రెయిన్ గోధుమపిండి ఒక కప్పు
కరివేపాకు ఒక కప్పు
ఉప్పు తగినంత
ఆలివ్ ఆయిల్ 1/4 టీ స్పూన్
తయారీ విధానం
ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో కరివేపాకు, గోధుమపిండి, తగినంత ఉప్పు, కొన్ని నీళ్లు పోసి రోటి పిండిలా బాగా కలుపుకోవాలి. దీంతో రోటీ తయారుచేసుకోవాలి. పెనంపై కాల్చుతూ రెండువైపులా ఆలివ్ఆయిల్ను పూయాలి. అంతే కరివేపాకు రోటి రెడీ. ఇది తింటే గర్భిణీల ఆరోగ్యానికి మంచిది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: శృంగారంతో ఇమ్యూనిటీ పెరుగుతుందా?