ETV Bharat / sukhibhava

ఇలా చేస్తే షుగర్ వ్యాధి రాదు! ప్రీడయాబెటిస్​ నుంచి ఎలా తప్పించుకోవాలి? - షుగర్ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలుతీసుకోవాలి

Prediabetes Treatment : జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల చాలా మంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులంటున్నారు. ఈ క్రమంలోనే షుగర్ (మధుమేహం) వ్యాధి వస్తుంది. రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి? ఈ విషయాలపై వైద్యుల సూచనలు మీ కోసం.

Diabetes Prevention
Diabetes Prevention
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 9:00 AM IST

Prediabetes Treatment : జీవనశైలిలో మార్పులు, ఉరుకుల పరుగులతో కూడిన జీవితం కారణంగా.. చిన్నా, పెద్ద అనే తేడాలేకుండా షుగర్ (మధుమేహం) వ్యాధి చాలా వేగంగా విస్తరిస్తుందని వైద్యనిపుణులు అంటున్నారు. ఈ వ్యాధినే డయాబెటిస్​ అని కూడా పిలుస్తున్నారు. అయితే మధుమేహం వచ్చేముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ప్రీ డయాబెటిస్​ అంటే ఏంటి?. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాధి భారిన పడకుండా ఉండవచ్చు. ఈ విషయాలపై వైద్యుల సూచనలు మీ కోసం.

'జీవనశైలిలో మార్పులే ముఖ్యకారణం'
మారిన జీవన పరిస్థితులు కారణంగా మధుమేహం లాంటి వ్యాధులు వస్తున్నాయని వైద్యలు అంటున్నారు. నిద్రలేమి, ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే మధుమేహం వ్యాధి రెండు దశల్లో ఉంటుందని వారు తెలిపారు అవి ప్రీ డయాబెటిస్, డయాబెటిస్.

"షుగర్​ వ్యాధి రావడానికి ముందు కనిపించే కొన్ని లక్షణాలను ప్రీడయాబెటిస్ అంటారు. ముఖ్యంగా ఫాస్టింగ్ బ్లడ్​ షుగర్​ 110 కంటే ఎక్కువగా ఉండి, ర్యాండమ్ షుగర్ 200 కంటే ఎక్కువగా ఉంటే దానిని డయాబెటిస్​గా పరిగణిస్తారు. ప్రీ డయాబెటిస్ లక్షణాలు పాదాల్లో మంటలు, మెడ భాగంలో చర్మం రంగు మారడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ షుగర్ వ్యాధి ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా వచ్చే అవకాశం ఉంది. తీసుకునే ఆహారం, శారీరక శ్రమ లాంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది."

--డాక్టర్. ప్రశాంత్​ కుమార్, జనరల్ ఫిజీషియన్

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం
ప్రీడయాబెటిస్ (మధుమేహ వ్యాధి ముందు)​ లక్షణాలున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్. ప్రశాంత్​కుమార్ సూచించారు అవేంటో తెలుసుకుందాం.

  • కార్బోహైడ్రేట్లు (బియ్యం) తీసుకోవడాన్ని తగ్గించండి
  • ప్రతి రోజూ శారీరక వ్యాయామం చేయండి
  • రైస్​ను ఎక్కువగా తీసుకోవద్దు
  • స్వీట్స్​ను ఎక్కువగా తీసుకోవద్దు
  • ఒత్తిడికి గురికావద్దు

రివర్సల్ ఆఫ్ డయాబెటిస్​
శారీరక వ్యాయమం, తగిన ఆహార నియమాలు పాటించడం ద్వారా ప్రీడయాబెటిక్ స్థితి నుంచి మధుమేహ వ్యాధి రాకుండా జాగ్రత్తపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈ పద్ధతినే రివర్సల్​ ఆఫ్ డయాబెటిస్​గా చెబుతున్నారు. ఆరోగ్య కరమైన జీవన విధానం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చని తెలిపారు. రివర్సల్ ఆఫ్ డయాబెటిస్​లో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని డా.శ్రావణి రెడ్డి తెలియజేశారు. అవేంటంటే

  • శారీరక వ్యాయామం చేయాలి
  • క్యాలరీలను కరిగించాలని
  • రోజుకు 8 గంటలు నిద్ర పోవాలి
  • రోజులో పదినుంచి 14 గంటలు తినకుండా ఉండటం

పై జాగ్రత్తలు పాటించడం ద్వారా షుగర్ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.

Diabetes Prevention

వేడి నీళ్లతో స్నానం చేస్తే ఎన్ని లాభాలో.. షుగర్ వ్యాధి సైతం దూరం!

ఆ తల్లిదండ్రుల సంతోషాన్ని చిదిమేస్తోన్న 'డయాబెటిస్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.