Belly Fat Loss Diet : ఒకే రకమైన, నిశ్చలమైన జీవన శైలి ఆరోగ్యానికి ప్రమాదం. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం లేదా తక్కువగా చేయడం, ఒత్తిడి ఎదుర్కొవటం, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల అన్ని శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ముఖ్యంగా పొట్ట భాగంలో బెల్లీ ఫ్యాట్ వస్తుంది.
శరీరమంతా సన్నగా ఉన్నప్పటికీ.. అధికంగా బెల్లీ ఫ్యాట్ కలిగి ఉండటం వల్ల చూడటానికి అందవిహీనంగా ఉంటుంది. అంతేకాకుండా దీని వల్ల గుండె సంబంధ వ్యాధులతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బరువును అదుపులో ఉంచుకుని అదనపు కొవ్వును తగ్గించుకోవడం ముఖ్యం. దీనికోసం తక్కువ క్యాలరీలు లేని ఆహారం తీసుకోవడం, మంచి డైట్ పాటించడం ఈ పనులు చేస్తే మంచి ఫలితాలుంటాయి.
క్యాలరీ లోటును సృష్టించడానికి మనం తినే దాని కన్నా.. ఎక్కువ క్యాలరీలు కరిగించాలి. బరువు, కొవ్వు తగ్గడంలో గణనీయమైన మార్పు చూడాలంటే.. రోజూ కనీసం 500 నుంచి 1000 క్యాలరీలు కరిగించాలి. ఇది కొవ్వును శక్తిగా మార్చడంలో సాయపడుతుంది. ఈ డైట్ పాటించడం వల్ల బెల్లీ ఫ్యాట్ తో పాటు ఇతర భాగాల్లో కొవ్వును కరిగించుకోవచ్చు.
వర్కౌట్స్..
Belly Fat Loss Diet Exercise : బరువు తగ్గడానికి ప్రధానంగా చేయాల్సింది వ్యాయామం. దీని వల్ల క్యాలరీలు ఖర్చయ్యి చురుగ్గా ఉంటారు. రోజుకు కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఇందులో వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ చేయాలి. బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్ వంటి సులభమైన ఆటలూ ఆడవచ్చు. ఎస్కలేటర్ బదులు మెట్లు ఎక్కడం వల్లా ఉపయోగం ఉంటుంది. వృత్తిరీత్యా మీరు ఎక్కువ సేపు కూర్చుని పనిచేయాల్సి వస్తే... ప్రతి గంటకోసారి లేచి నడవటం, 5 నిమిషాలు నిలబడటం చేయాలి.
ఆహార పరిమాణం తగ్గించడం..
Belly Fat Loss Diet Food Control : వ్యాయామం చేయడం వల్ల క్యాలరీలు తగ్గించడం మాత్రమే కాదు.. దీంతో పాటు మీకు ఇష్టమైన ఆహారాన్ని త్యాగం చేయాలి. పరిమితంగా ఆహారం తీసుకోవాలి. మీ కడుపు 80 శాతం నిండే వరకు మాత్రమే తినాలి. భోజనానికి మధ్యలో కనీసం 3-4 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి. అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల్ని నివారించడానికి రాత్రి 8 గంటలకు ముందే తినటం ఉత్తమం.
హైడ్రేట్‌గా ఉండాలి..
Belly Fat Loss Diet Water : బరువు తగ్గాలనుకునే వారు తగినంత నీరు తాగడమూ అవసరమే. దీని వల్ల మీ శరీరం హైడ్రేట్‌గా ఉంచి ఆకటి దప్పుల్ని తగ్గిస్తుంది. తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఇవి శరీరంలోని టాక్సిన్లను వెల్లగొడతాయి.