ETV Bharat / sukhibhava

ఎక్కువ సార్లు శృంగారంలో​ పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందా? - సెక్స్​ ఆయుష్టు

ఆయుష్షు(regular sex benefits) పెంచుకోవాలంటే ఎక్కువ సార్లు రతిలో పాల్గొనాలని అంటున్నారు పరిశోధకులు. వారానికి ఒకటి కన్నా తక్కువసార్లు సెక్స్​లో పాల్గొనేవారితో పోలిస్తే వారానికి ఒకట్రెండు సార్లు శృంగారంలో పాల్గొనేవారిలో రోగనిరోధకశక్తి(immunity booster) బలోపేతమవుతుందని వెల్లడించారు. మరి సహజంగా శృంగార జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి?

sex
సెక్స్​
author img

By

Published : Oct 12, 2021, 9:06 AM IST

ఆయుష్షు(regular sex benefits) పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి? పొగ మానెయ్యాలి. రోజూ వ్యాయామం చేయాలి. కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండే ఆహారం తినాలి. రాత్రిపూట కంటి నిండా నిద్రపోవాలి. మద్యం అతిగా తాగొద్దు. మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో భావోద్వేగ సాన్నిహిత్యం కలిగుండాలి. ఈ జాబితాకు శృంగారాన్నీ జోడించుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.

ఇది జీవనకాలాన్ని 20 ఏళ్ల వరకు(regular sex is good or bad ) పొడిగించొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరణించే ముప్పును సగానికి తగ్గించొచ్చనీ మరికొన్ని సూచిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. శృంగారమనేది భాగస్వాముల మధ్య సన్నిహిత సంబంధానికి సంకేతం. ఆత్మీయ సంబంధంతో మానసిక బలమూ ఇనుమడిస్తుంది. ఫలితంగా కుంగుబాటు(depression side effects), దిగులు దరిచేరవు. శృంగారం వ్యాయామంగానూ ఉపకరిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. తరచూ శృంగారంతో రోగనిరోధకశక్తి(immunity booster) బలోపేతమవుతుంది. వారానికి ఒకటి కన్నా తక్కువసార్లు శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే వారానికి ఒకట్రెండుసార్లు శృంగారంలో పాల్గొనేవారి లాలాజలంలో ఇమ్యునోగ్లోబులిన్‌ ఏ (ఐజీఏ) మోతాదులు ఎక్కువగా ఉంటున్నట్టు వైక్స్‌ యూనివర్సిటీ అధ్యయనం ఒకటి పేర్కొంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఐజీఏ కీలక పాత్ర పోషిస్తుంది. మరి సహజంగా శృంగార(sex foods) జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి? వ్యాయామం వంటి వాటితో పాటు తిండి మీదా కాస్త శ్రద్ధ పెట్టాలి.

  • సోయా, చేపల వంటివి సెక్స్‌ హార్మోన్ల మోతాదులు పెరిగేలా చేస్తాయి.
  • పలచటి ప్రొటీన్లతో కూడిన కోడి మాంసం వంటి వాటిల్లో టైరోసైన్‌, ఫినైల్‌ అలనైన్‌ ఉంటాయి. ఇవి శృంగారాసక్తి పెరిగేలా చేస్తాయి.
  • తక్కువ కొవ్వు గల పెరుగు, గుడ్ల వంటివాటిల్లో కొలైన్‌ ఉంటుంది. శృంగార కాంక్షను నియంత్రించే రసాయనానికి ముందు రూపం ఇదే.
  • పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, ఎక్కువ పీచుతో కూడిన పదార్థాల్లో గ్లుటమైన్‌, ఐనోసిటాల్‌ ఉంటాయి. భావప్రాప్తికి చేరుకునే దశలో స్థిమితంగా ఉండటానికి తోడ్పడే రసాయనం వీటి నుంచే పుట్టుకొస్తుంది.

ఇదీ చూడండి: 80 ఏళ్ల వయసులోనూ శృంగార కోరికలు.. కారణాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.