ETV Bharat / sukhibhava

గర్భిణికి... రొమ్ము క్యాన్సర్‌ రాదు నిజమేనా? - symptoms of breast cancer

నమిత అప్పుడే పిల్లలు వద్దనుకుని గర్భనిరోధక మాత్రలు వాడుతోంది... వాటితో రొమ్ముక్యాన్సర్‌ వస్తుందని స్నేహితురాలు చెప్పినప్పట్నుంచీ సంశయంలో పడింది! రజనీకి బ్రా ఒంటి మీద ఉన్నంతసేపూ రొమ్ముక్యాన్సర్‌ వస్తుందేమోనని అనుమానం వెంటాడుతుంది. ప్రియా వయసు నలభై దాటింది. రొమ్ముక్యాన్సర్‌ పరీక్ష చేయించుకోవాలని ఉన్నా ‘ఆ నొప్పి భరించలేవ్‌’ అని అంతా అనడంతో వెనకాడుతోంది. మరి వీళ్లవి కేవలం అపోహలేనా.. వాస్తవాలా? తెలుసుకుందాం!

Is it true that a pregnant woman does not get breast cancer?
గర్భిణికి... రొమ్ము క్యాన్సర్‌ రాదు నిజమేనా?
author img

By

Published : Oct 4, 2020, 10:29 AM IST

అపోహ: గర్భనిరోధక మాత్రల వల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వస్తుంది.

వాస్తవం: ఇప్పుడు మనకు దొరుకుతున్న గర్భనిరోధక మాత్రల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్ల ఈ మాత్రలతో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదమేమీ లేదు.

అపోహ: గర్భనిరోధక మాత్రలవల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రావొచ్చు.

వాస్తవం: ఇప్పుడు మనకు దొరుకుతున్న గర్భనిరోధక మాత్రల్లో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ వంటి హార్మోన్లు చాలా తక్కువ మోతాదులో ఉంటున్నాయి. అందువల్ల వీటితో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదమేమీ లేదు.

అపోహ: గర్భిణులకు క్యాన్సర్‌ రాదు.

వాస్తవం: ప్రెగ్నెన్సీలోనూ రొమ్ము క్యాన్సర్‌ రావొచ్చు. గర్భిణులూ, పాలిచ్చే తల్లుల్లో సాధారణ సమయంలో కంటే రొమ్ములు పెద్దగా, మృదువుగా ఉంటాయి. దాంతో ఈ సమయంలో రొమ్ములో ఉన్నది క్యాన్సర్‌ గడ్డా కాదా అనేది తెలుసుకోవడం కాస్త కష్టమవుతుంది. దాంతో రోగ నిర్ధారణ ఆలస్యమవుతుంది. అలాగే పాలిచ్చే తల్లుల్లో రొమ్ము క్యాన్సర్‌ రాదనేది కూడా నిజం కాదు. రావొచ్చు. కానీ పాలివ్వడం వల్ల కొంతవరకూ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి ఆస్కారం ఉంది.

అపోహ: బ్రా వేసుకోవడం.. ముఖ్యంగా స్పోర్ట్స్‌, అండర్‌వైరుతో ఉన్న బ్రాని ధరించడం వల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వస్తుంది.

వాస్తవం: బ్రాను ధరించడం వల్ల క్యాన్సర్‌ వస్తుందనడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. అలాగే సెల్‌ఫోన్‌కూ, బ్రెస్ట్‌క్యాన్సర్‌కూ కూడా ఎలాంటి సంబంధమూ లేదు. అయినా మొబైల్‌ని ఎంత దూరంలో ఉంచితే అంత మంచిది.

అపోహ: చిన్నవయసు వారికి రొమ్ము క్యాన్సర్‌ రాదు.

వాస్తవం: ఇది ఏ వయసులోనైనా రావొచ్చు. మన దేశంలో చిన్నవయసు నుంచే.. అంటే 40 ఏళ్ల నుంచే మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లుగా తెలుస్తోంది. జన్యుపరంగా 5-10 శాతం మందికి వస్తుంది. ఇతర కారణాల వల్ల కూడా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి.. 40 దాటిన తర్వాత ఏడాదికోసారి స్క్రీనింగ్‌ మామోగ్రామ్‌ చేయించుకోవడం తప్పనిసరి. ఇది ఒకరకమైన ఎక్స్‌రే. రొమ్ములో గడ్డలున్నాయని మహిళ, వైద్యుడు కూడా గుర్తించని స్థితిలో స్క్రీనింగ్‌ మమోగ్రామ్‌ ద్వారా తొలిదశలోనే కచ్చితంగా కనుక్కోవచ్చు. చాలామంది ‘రొమ్ములో గడ్డ ఉంటే మనకు తెలియకుండా ఉండదు కదా’ అనుకుని మామోగ్రామ్‌ని దాటవేస్తుంటారు. ఒక్కోసారి గడ్డలు ఉండవు.. చనుమొనలపై రక్తపు చారలు కనిపిస్తాయి, మరికొన్నిసార్లు చర్మంపై దద్దుర్లు వస్తాయి. రొమ్ము దగ్గర చర్మం మందంగా మారొచ్చు. సొట్టలు పడి లోపలకు వెళ్లొచ్చు. ఇవి కూడా లక్షణాలే.

అపోహ: రొమ్ములో గడ్డ కనిపిస్తే.. క్యాన్సర్‌ వచ్చినట్టే!

వాస్తవం: నిజం కాదు. రొమ్ములో పదిగడ్డలు ఉన్నాయనుకోండి... తొమ్మిది గడ్డలు క్యాన్సర్‌కి సంబంధించినవి కావు. అయితే రొమ్ము ఆకృతిలో మార్పులు వస్తే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. రొమ్ము పెద్దగా అవుతున్నా... చిన్నగా మారుతున్నా గమనించుకోవాలి. చనుమొనలు లోపలికి ముడుచుపోవడం లేదా దాని ఆకృతి మారిపోవడం, వాటి చుట్టూ చర్మం కందిపోవడం జరుగుతుంటే వైద్యులని సంప్రదించాలి. చనుమొనల నుంచి రక్తస్రావం అవుతున్నా, బాహుమూలల కింది భాగంలో వాపు కనిపిస్తున్నా జాగ్రత్తపడాలి. వైద్యులను సంప్రదిస్తే.. క్లినికల్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌, బైలేటరల్‌ మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్‌ పరీక్షలను నిర్వహిస్తారు. గడ్డలుంటే ఆపరేషన్‌ లేకుండా చిన్న సూది ద్వారా ముక్కను తీసి పరీక్షించి క్యాన్సర్‌ ఉందో లేదో చెబుతారు.

అపోహ: క్యాన్సర్‌ తగ్గినా ముందులా హాయిగా జీవించలేం.

వాస్తవం: ఇందులో కొంతే నిజం. చిన్నవయసులో వస్తే.. ఈ వ్యాధి నయమైన తరువాత సంతానం కోసం మూడు నుంచి అయిదేళ్లపాటు ఆగాల్సి ఉంటుంది. వయసు పైబడినవారు చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్న తరువాత సాధారణ జీవితం గడపొచ్చు. అయితే, చికిత్స చేయించుకున్న భాగంవైపు ఆ చేత్తో బరువులు ఎత్తకూడదు. ఆ చేతికి ఇంజెక్షన్‌ చేయించుకోకూడదు. సెలైన్‌ పెట్టించుకోకూడదు. బీపీ పరీక్ష చేయించుకోకూడదు. ఇలా చేస్తే ఒత్తిడి పెరిగి అక్కడ వాపు వస్తుంది. దీన్నే లింఫ్‌ ఎడిమా అంటారు. ఇలా వాపు రాకుండా జీవితాంతం చూసుకోవాలి. మూడు నెలలకోసారి వైద్యులను సంప్రదిస్తూ, ఏడాదికోసారి స్క్రీనింగ్‌ మామోగ్రామ్‌ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

అపోహ: మమోగ్రఫీ పరీక్ష చాలా నొప్పిగా ఉంటుంది. దీని వల్ల రేడియేషన్‌కు గురయ్యే ప్రమాదముంది.

వాస్తవం: ఈ పరీక్షతో కొద్దిపాటి అసౌకర్యం ఉన్నా... నొప్పిని కలిగించదు. ఈ ప్రక్రియలో చాలా తక్కువ మొత్తంలో రేడియేషన్‌ను ఉపయోగిస్తారు. ముఖ్యంగా డిజిటల్‌ మమోగ్రఫీలో అతి తక్కువ రేడియేషన్‌ను వాడతారు. రొమ్ములోని సూక్ష్మమార్పులను సైతం ఇది గుర్తుపడుతుంది. అయితే నలభై ఆపై వయసున్న మహిళలకు మాత్రమే ఇది ప్రభావమంతంగా పనిచేస్తుంది. నలభై ఏళ్ల లోపు ఏ లక్షణాలు లేనివారికి ఇది అవసరం లేదు.

కొన్నికారణాలు ఇవి...

కుటుంబంలో దగ్గర సంబంధీకులకుఎవరికైనా రొమ్ము క్యాన్సర్‌ ఉన్నపుడు

రుతుచక్రం పదకొండేళ్ల లోపు మొదలైనవారిలో..

యాభై అయిదేళ్ల తరువాతŸ కూడా మెనోపాజ్‌ రానివారిలో (లేట్‌ మెనోపాజ్‌)

సంతానం లేనివారు, ముప్పై ఏళ్ల తరువాత మొదటి బిడ్డకు జన్మనిచ్చినవారిలో

చాలాకాలంపాటు హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ తీసుకున్నవారిలో

ఊబకాయం (మెనోపాజ్‌ తరువాత అధిక బరువున్నవారిలో)

పాలు ఇవ్వని తల్లుల్లో...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.