శృంగారమనేది భాగస్వాముల మధ్య సన్నిహిత సంబంధానికి సంకేతం. ఆత్మీయ సంబంధంతో మానసిక బలమూ ఇనుమడిస్తుంది. ఫలితంగా కుంగుబాటు, దిగులు దరిజేరవు. శృంగారం వ్యాయామంగానూ ఉపకరిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. తరచూ శృంగారంతో రోగనిరోధకశక్తీ బలోపేతమవుతుంది. వారానికి ఒకటి కన్నా తక్కువసార్లు శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే వారానికి ఒకట్రెండు సార్లు శృంగారంలో పాల్గొనేవారి లాలాజలంలో ఇమ్యునోగ్లోబులిన్ ఏ (ఐజీఏ) మోతాదులు ఎక్కువగా ఉంటున్నట్టు వైక్స్ యూనివర్సిటీ అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఐజీఏ కీలక పాత్ర పోషిస్తుంది.
Food for sexual health: మరి సహజంగా శృంగార జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి? వ్యాయామం వంటి వాటితో పాటు తిండి మీదా కాస్త శ్రద్ధ పెట్టాలి.
- సోయా, చేపల వంటివి సెక్స్ హార్మోన్ల మోతాదులు పెరిగేలా చేస్తాయి.
- పలుచటి ప్రొటీన్లతో కూడిన కోడి మాంసం వంటి వాటిల్లో టైరోసైన్, ఫినైల్‌అలనైన్ ఉంటాయి. ఇవి శృంగారాసక్తి పెరిగేలా చేస్తాయి.
- తక్కువ కొవ్వు గల పెరుగు, గుడ్ల వంటివాటిల్లో కొలైన్ ఉంటుంది. శృంగార కాంక్షను నియంత్రించే రసాయనానికి ముందు రూపం ఇదే.
- పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, ఎక్కువ పీచుతో కూడిన పదార్థాల్లో గ్లుటమైన్, ఐనోసిటాల్ ఉంటాయి. భావప్రాప్తికి చేరుకునే దశలో స్థిమితంగా ఉండటానికి తోడ్పడే రసాయనం వీటి నుంచే పుట్టుకొస్తుంది.
ఇవీ చూడండి: