IBD disease: సరిగా తినకపోతే బరువు పెరగడం కష్టమని మనకు తెలుసు. కానీ, బాగా తింటున్నా బరువు పెరగకపోతే అది కచ్చితంగా సమస్యే. పేగుల్లో పూత వ్యాధి ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటప్పుడు ఎంతగా తింటున్నా మనకు ఒంట పట్టదు. అస్తమానం పొట్టలో నొప్పి, తరచూ విరోచనాలు వేధిస్తుంటాయి. తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. పేగు పూత వ్యాధులనే వైద్య పరిభాషలో ఇన్ఫ్లమేటరి బొవెల్ డిసీజెస్ అని వాడుక భాషలో ఐబీడీ అని పిలుస్తారు.
రోజువారీ జీవనాన్ని దుర్భరంగా మార్చే పేగుపూత వ్యాధులకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నిపుణుల మాట..
ఐబీడీ రావడానికి అనేక రకాల కారణాలుంటాయి. జన్యుపరంగా, వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఇది రావొచ్చు. ఇమ్యూనిటీ కూడా ఓ కారణమే.
విరోచనాలు, రక్త విరోచనాలు, కడుపునొప్పి ఎక్కువగా రావడం, చిక్కిపోవడం ఇవన్నీ వ్యాధి లక్షణాలు. ట్రీట్మెంట్ పరంగా చూస్తే.. అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్కు ఒకే రకమైన వైద్యం ఉంటుంది. అల్సరేటివ్ కొలైటిస్‌కు ఏ మందులూ పనిచేయనప్పుడు పెద్ద పేగు పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. చిన్నపేగును పౌచ్లాగా మార్చడం చేస్తుంటాం. ఇలా చేస్తే ప్రాక్టికల్‌గా సమస్య నయమవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: