ETV Bharat / sukhibhava

How To Look Young Forever : ఆరు పదుల వయసులోనూ యవ్వనంగా కనిపించాలా?.. ఈ 10 టిప్స్​ పాటిస్తే చాలు! - యవ్వనంగా కనిపించేందుకు పాటించాల్సిన నియమాలు

How To Look Young Forever : వయసు పెరిగేకొద్దీ మనిషి శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. దీన్నే ఏజింగ్​ ప్రక్రియ అంటారు. అంటే యవ్వనత్వం నుంచి ముసలి ప్రాయంలోకి వెళ్లే ప్రాసెస్​. అయితే దీనిని నివారించి.. నిదానింపజేసే ఆయుధాలు మన చేతుల్లోనే ఉంటాయనే విషయాన్ని మర్చిపోకూడదు. మరి ఇందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

How To Look Younger Than Your Age
How To Look Young Forever In Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 7:56 AM IST

Updated : Oct 2, 2023, 9:57 AM IST

How To Look Young Forever : వయసు పెరుగుతున్న కొద్దీ మన ముఖంలో, శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. చర్మం ముడతలు పడి అందం కోల్పోతుంది. శరీర ఆకృతి, సౌష్టంలో తేడాలోస్తాయి. అయితే మన ఆలోచనలు, అలవాట్లు, జీవనశైలి సవ్యంగా ఉంటే వయసు పెరుగుతున్నప్పటికీ అందంగా, ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండవచ్చు. పెరుగుతున్న వయసు తాలుకు లక్షణాలను నివారించాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కంటినిండ నిద్ర చాలా అవసరం!
మన ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. తగినంత నిద్ర లేకపోతే శరీరం ముడతలు పడిపోయి వయసు మీరిన లక్షణాలు త్వరగా కనబడతాయి. ఈ క్రమంలో కార్టిసాల్​ హార్మోన్​తో పాటు మరికొన్ని హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. పెద్దవారు రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. చిన్నపిల్లలు అయితే రోజుకు కనీసం 8 గంటల నుంచి 12 గంటలు నిద్రపోవాలి. కంటినిండా నిద్ర లేనప్పుడు మన శరీర అవ్యయవాల పనితీరు కూడా దెబ్బతింటుంది. దీంతో మన శరీరానికి విశ్రాంతి దొరక్కపోగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడతాం.

మన శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వనప్పుడు చర్మం, మెదడు యాక్టివ్​గా పనిచేయలేవు. ఇది మీ యవ్వనత్వంపై ప్రభావం చూపుతుంది. అందుకే రోజుకు సరిపడా నిద్ర పోవడం ద్వారా మీ బాడీ రిలాక్జ్​ అవుతుంది. తద్వారా మీ మెదడుకు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీంతో మనం యవ్వనంగా కనబడతాం.

సిగరెట్​కు ఆమడ దూరంలో!
పొగాకు అలవాటు ఉన్నవారిలో కూడా వయసు మీరిన లక్షణాలు త్వరగా బయటపడతాయి. తరచు సిగరెట్​ తాగేవారు వైద్యుల సలహాలు తీసుకొని ఆ అలవాటు నుంచి బయటకు రావడం మంచిది. ధూమపానం మానేయటం ద్వారా మన బ్రెయిన్​ యవ్వనంగా ఉంటుంది. ఇది మన ఆలోచనా శక్తిని కూడా మెరుగు పరుస్తుంది. అంతేకాకుండా పొగాకు ద్వారా కలిగే అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా సులువుగా బయటపడవచ్చు.

ఎండలో ఎక్కువగా ఉండేవారిలోనూ!
ఎండలో ఎక్కువగా ఉండేవారిలో కూడా చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎండలో తిరగటం వలన చర్మం మందమై రంగు తగ్గుతుంది. ముడతలు, మచ్చలు వస్తాయి. ఎండలో తిరిగే వారు చర్మానికి ఎండ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సన్​గ్లాస్​లు, టోపీ, పొడవు చేతుల దుస్తులు వంటివి వాడాలి. SPF 30 అంతకంటే ఎక్కువగా ఉన్న సన్​స్క్రీన్​ను వాడటం వలన చర్మానికి ఎండ నుంచి రక్షణ లభిస్తుంది.

వీటికి దూరంగా ఉండాలి!
నిద్ర సమస్య ఉన్నవారు నిద్రకు ముందు మద్యపానం, కెఫిన్​కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్స్​ ద్వారా కలిగే దుష్ఫలితాలు అనేకం. ఈ రోజుల్లో చాలామంది కనీసం 10 నుంచి 12 గంటల వరకు ఫోన్​లు, ల్యాప్​టాప్​లు, కంప్యూటర్లపైనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. కొందరు వృత్తిరీత్యా ఈ పనిచేస్తుంటే.. మరికొందరు కాలక్షేపానికి ఎక్కువసేపు స్క్రీన్​పైనే తమ సమయాన్ని స్పెండ్​ చేస్తున్నారు. ఇది మన కళ్ల మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే గంటల తరబడి ఫోన్​లలో మాట్లాడటం వల్ల ఏర్పడే తరంగాలు కూడా మన మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. తద్వారా మీ ఏజింగ్​ ప్రక్రియ వేగంగా జరిగి మీ ముఖంలో యవ్వన ఛాయలు చిన్న వయసులోనే తగ్గిపోతాయి.

క్రమం తప్పకుండా వ్యాయామం మస్ట్​!
ప్రతిరోజూ వ్యాయామం చేసేవారిలో ఏజింగ్​ ప్రక్రియ నెమ్మదిస్తుందని డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా రోజుకు కొద్దిసేపు యోగా, ధ్యానం లాంటివి చేస్తే కూడా మీ యవ్వనత్వాన్ని బ్యాలెన్స్​ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అలాగే క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వలన మీలో వయసు మీరిన లక్షణాలను నివారించుకోవచ్చు. వ్యాయామంతో శరీర కండరాలు శక్తిమంతమవుతాయి. అలాగే వయసు పెరగటం వలన వచ్చే అనారోగ్యాలను కూడా నివారించే అవకాశం ఉంటుంది.

మానసిక ఒత్తిళ్లకు దూరం!
ముఖంలో ముసలితనం ఛాయలు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా మానసిక, శారీరక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. ఒక్కోసారి మనకి తెలియకుండా మనమే తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతుంటాం. దీంతో మీ ముఖంలో, శరీరంలో కీలక మార్పులు జరుగుతాయి. ఇవి మీరు త్వరగా యవ్వనత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి. రోజుకు 10 నుంచి 20 నిమిషాల పోటా ధ్యానం చేస్తే స్ట్రేస్​కు దూరంగా ఉండవచ్చు.

చర్మాన్ని తేమగా ఉంచుకోండి!
శరీరానికి తగినంత తేమ అందకపోతే చర్మం పొడిబారిపోయి గరుకుగా, పొలుసులుగా కనబడుతుంటుంది. చర్మాని శుభ్రపరుచుకునేటప్పుడు చర్మంపై ఎక్కువ ఒత్తిడిని కలిగించకూడదు. గట్టిగా ఉండే స్క్రబ్​లను వాడితే చర్మం తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంది. చర్మం శుభ్రతకు వాడే సబ్బుల్లో ఆల్కహాల్​ లేదా చర్మానికి అసౌకర్యానికి కలిగించే ఇతర అంశాలేవి లేకుండా చూసుకోవాలి. రోజుకు రెండు సార్లు చర్మానికి స్కిన్​ లోషన్స్​​ను అప్లై చేసుకోవాలి.

పౌష్టికాహారం తీసుకోవాలి!
యవ్వనంగా ఉండాలన్నా, కనిపించాలన్నా మంచి పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. చేపలు, గింజలు, ఆలివ్​ ఆయిల్​, ముడి ధాన్యాలు, ఆకుకూరలు, గుడ్లు వంటి ఆహారాలు గుండెకు, మెదడుకు మేలు చేస్తాయి.

రోజుకు ఇన్ని లీటర్ల నీళ్లు కచ్చితంగా తాగాలి!
శరీరానికి సరైన మోతాదులో మంచినీళ్లు అందించడం చాలా ముఖ్యం. నీరు​ అనేది మన చర్మాన్ని రీజువినేట్​ చేస్తుంది. రోజుకు కనీసం రెండున్నర లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు తీసుకోవాలి. అయితే లీటర్ల కొద్ది ఒకటేసారి తాగకుండా ప్రతి గంటకు లేదా రెండు గంటలకు ఒక గ్లాస్​ చొప్పున తాగితే మంచిది.

నలుగురితో సరదాగా ఉండండి!
నలుగురితో కలిసిమెలిసి జీవించే వారి మనస్సు యవ్వనంగా ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. వయస్సు మళ్లటం వలన వచ్చే యాంక్జైటీ, డిప్రెషన్​, డిమెన్షియా వంటి అనారోగ్య సమస్యలను కూడా ఈ చిట్కా ద్వారా నివారించే అవకాశం ఉంటుంది.

ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి!
వయసు పెరుగుతున్నప్పుడు కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా క్రమం తప్పకుండా రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. అధిక రక్తపోటు వలను మెదడులోని సన్నని రక్తనాళాలు దెబ్బతిని మెదడుకు సంబంధించి పలు అనారోగ్య సమస్యలకు గరయ్యే ప్రమాదం ఉంటుంది. మంచి ఆహారం, వ్యాయామం, మందులతో రక్తపోటును నియంత్రణలో ఉంచుకుంటే మెదడు ఆరోగ్యం బాగుంటుంది. ఈ జాగ్రత్తలతో వయసు మీరటం వలన వచ్చే లక్షణాలను, సమస్యలను నివారించవచ్చు.

చివరగా కాలంతో పాటు వయసు పెరగటం సహజం. అయితే వయసు మారిన లక్షణాలను నివారించటం, నిదానింపచేయటం అనే అంశాలు మన చేతుల్లోనే ఉన్నాయన్న విషయం మాత్రం మర్చిపోకూడదు. అనారోగ్యాన్ని పెంచే అలవాట్లకు దూరంగా ఉంటూ.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటం ద్వారా మరింత ఎక్కువ కాలం అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఆరు పదుల వయసులోనూ యవ్వనంగా కనిపించాలా?

Memory Loss Disease Dementia : నడి వయస్సులో మతిమరుపు.. కారణాలు, నివారణ మార్గాలు!

How To Cure Spine Problems : వెన్నెముక సమస్య వేధిస్తోందా?.. సింపుల్ టిప్స్​తో చెక్​ పెట్టేయండిలా!

Last Updated : Oct 2, 2023, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.