జుట్టు బలంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు. కానీ.. కాలుష్యం, ఒత్తిడి ఇలా రకరకాల కారణాలతో జుట్టు బలహీనపడుతోంది. మరి, జుట్టుకు మళ్లీ జీవం పోయాలంటే ఏం చేయాలో చూసేయండి...
- కొందరి జుట్టు కాలంతో పని లేకుండా పొడిబారినట్లు అవుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే రాలడం ఖాయం. ఇలాంటప్పుడు ఆలివ్, కొబ్బరి నూనెల్ని సమపాళ్లలో తీసుకుని మరిగించాలి. దాన్ని తలకు పట్టించి బాగా మర్దన చేయాలి. ఆపై గంటాగి గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే సరి. జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.
- తలస్నానం చేసినా కొన్నిసార్లు జుట్టులో మెరుపు కనిపించదు. బలహీనంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు గ్రీన్‌టీని మరగకాచి చల్లార్చి..అందులో కొన్ని చుక్కల ఆలివ్ నూనె కలిపి జుట్టు కుదుళ్ల నుంచీ కొసల వరకూ తడపాలి. అరగంట తరవాత తలస్నానం చేస్తే జాలువారుతూ మెరిసిపోతుంది. రాలే సమస్యా తగ్గుతుంది.
- జుట్టు బలహీనంగా మారి ఊడిపోతున్నప్పుడు.. కొబ్బరిపాలల్లో చెంచా ఆలివ్‌నూనె, కాస్త కలబంద గుజ్జు, మూడు గుడ్లలోని తెల్లసొన కలిపి బాగా గిలకొట్టి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట తరవాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే సరి.
ఇదీ చదవండి: పురాతన ఆయుర్వేద పద్ధతిలో.. నోరు శుభ్రమైపోతుంది!