These Habits Cause Constipation in Winter : మూమూలు రోజులతో పోలిస్తే వింటర్ సీజన్లో జీర్ణక్రియ కొంత మందగిస్తుంది. అలాగే తగిన మొత్తంలో విటమిన్ డి అందక ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. ఇకపోతే చాలా మంది చలికాలం(Winter)లో తీసుకునే ఆహారం విషయంలో అశ్రద్ధ వహిస్తుంటారు. దాంతో మలబద్ధకం సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. కేవలం ఫుడ్ వల్ల మాత్రమే కాదు.. చలికాలంలో వారు ఫాలో అయ్యే కొన్ని అనారోగ్యకర అలవాట్లు మలబద్ధకం సమస్య రావడానికి కారణమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే మీరు ఆ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడే ఆ అలవాట్లకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు. లేదంటే కొన్ని తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
నీరు తక్కువ తాగడం : చాలా మంది మామూలు టైమ్‌లోనే సరిగా వాటర్ తాగరు. ఇక వింటర్ సీజన్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెదర్ కూల్‌గా ఉండడంతో ఎక్కువ మంది నీరు తాగడానికి ఇష్టపడరు. దాంతో బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఫలితంగా తీసుకున్న ఫుడ్ సరిగ్గా జీర్ణం కాక.. మలం పేగుల్లో గట్టిపడుతుంది. దాంతో పేగు కదలికల్లో ఇబ్బందులు ఏర్పడి.. మలబద్ధకం ప్రాబ్లమ్ ఎదురవుతుంది.
ఫైబర్ తక్కువ తీసుకోవడం : జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే బాడీకి తగిన మొత్తంలో ఫైబర్ అందించడం చాలా అవసరం. కానీ, నేటి యువత ఎక్కువగా జంక్‌ఫుడ్‌ను తీసుకుంటున్నారు. అది కూడా మలబద్ధకానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాట్స్, చక్కెర స్థాయిలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ అనేది అసలు ఉండదు. దాంతో జీర్ణక్రియకు అంటంకం కలిగి మలబద్ధకం ఏర్పడుతుంది. కాబట్టి ఏ కాలమైనా శరీరానికి సరిపడా ఫైబర్ తీసుకోవాలి.
టీ, కాఫీలు : చాలా మంది చలికాలం కాబట్టి శీతల వాతావరణాన్ని తట్టుకోవడానికి, బాడీ హీట్‌గా ఉండడం కోసం వేడివేడి టీ, కాఫీలు ఎక్కువగా డ్రింక్ చేస్తుంటారు. అది కూడా మలబద్ధకాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటిని అధికంగా తాగడం ద్వారా అందులో ఉండే కెఫిన్ శరీరంలో పేరుకుపోయి డీహైడ్రేషన్‌ను కలిగిస్తుంది. దాంతో పేగు కదలికల్లో అంతరాయం కలిగి మలబద్ధకానికి దారి తీస్తుంది.
చలికాలంలో బద్ధకాన్ని వదిలి బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ టిప్స్ ట్రై చేయండి!
వ్యాయామం : మనం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. కానీ, ఎక్కువ మంది ఈ కాలంలో మార్నింగ్ చలి ఉందని, మంచు కమ్మేసిందని వాకింగ్, రన్నింగ్ లాంటి వాటికి వెళ్లరు. దాంతో బాడీ కూడా రెస్ట్ పొజిషన్లోకి వెళుతుంది. ఇలాంటి టైమ్‌లో శరీరానికి తగినంత శ్రమ లభించక జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. ఫలితంగా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది.
ఎక్కువగా మందులు వాడడం : చలికాలంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. దాంతో చాలా మంది మందులు వాడుతుంటారు. అయితే ఈ టైమ్‌లో మీరు వాడే కొన్ని మందులు కూడా మలబద్ధకాన్ని కలిగించొచ్చు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కోల్డ్ రెమిడీస్, పెయిన్ రిలీవర్స్ వంటి మందుల వాడకం ఎక్కువ అయింది. ఇది కూడా డైజేషన్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతోంది. అలాగే వెదర్ కూల్‌గా ఉంటే కొందరికి బాత్రూమ్ వెళ్లాలనిపించదు. ఇది కూడా మలబద్ధకానికి కారణమవుతుంది.
మలబద్ధకం లక్షణాలు ఏంటంటే.. ఈ సమస్య ఉన్నవారిలో పెద్ద పేగు కదలికలు తగ్గడం, మలమూత్ర విసర్జనలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మలవిసర్జన చేయాలనిపించినా అది రాకపోవడం, నొప్పి, కడుపు ఉబ్బరం, ఫుడ్ తీసుకోవాలనిపించకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఏ కాలమేదైనా ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే మీ డైట్లో మంచి పోషకాహారాన్ని యాడ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లను తరచూ తినేవిధంగా చూసుకోవాలి.
ఆఫ్ట్రాల్ పల్లీ పట్టి అని తీసిపారేయకండి - ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో తెలిస్తే వదిలిపెట్టరు!
చలికాలంలో డేట్స్ తినడం వల్ల లాభాలు ఇవే!-తెలిస్తే వదిలిపెట్టరు సుమీ!