ETV Bharat / sukhibhava

చలికాలంలో చురుగ్గా ఉండాలంటే.. ఇవి తినండి! - diet for fitness

చలి పంజా విసురుతోంది. దీంతో శారీరకంగానూ కాస్త బద్ధకం, ఇంకొంత నీరసం ఆవహించి.. పని వేగం మందగిస్తుంది. అలా కాకుండా చురుగ్గా ఉండాలంటే ఏం తినాలో సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.

healthy diet in winter
ఆహారం
author img

By

Published : Dec 23, 2022, 10:00 AM IST

చలికాలం ప్రారంభమైంది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో ఉదయం పూట జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఈ సీజన్‌లో చలి నుంచి ఉపశమనం పొందడానికి జనాలు టీ, కాఫీ, పాస్ట్‌ఫుడ్ వంటి వేడి పదార్థాలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అయితే శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి, అలాగే ఫిట్‌గా ఉండడానికి డైట్‌లో కొన్ని పదార్థాలు చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..

తృణధాన్యాలు: వీటి స్వభావరీత్యా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా.. శరీరానికి అవసరమైన పోషకాలనిస్తాయి. వీటిలోని మాంసకృత్తులూ, పీచు మెటబాలిజం రేటుని మెరుగు పరుస్తాయి. తక్షణ శక్తిని అందిస్తాయి.

winter diet
తృణధాన్యాలు

గింజలు: మధ్యాహ్నం భోజనం అయ్యాక.. రెండు గంటల తర్వాత నట్స్‌ లేదా సీడ్స్‌ని స్నాక్స్‌లా తీసుకోండి. ఇవి అలసటను రానీయవు. శరీరానికి ఫైబర్‌, విటమిన్లూ కూడా సరైన మోతాదులో అందుతాయి.

ఓట్స్‌: ఓ కప్పు ఓట్స్‌ని అల్పాహారంగా తీసుకుని ఉదయాన్ని ప్రారంభించండి. ఇందులో ఫైబర్‌తో పాటు ప్రొటీన్‌ ఉంటుంది. విటమిన్‌ బి సహజంగా శరీరానికి లభిస్తుంది. కొవ్వుని కరిగించడంలో, శరీరంలో ఇన్సులిన్‌ స్థాయులు తగ్గకుండానూ ఇందులోని పోషకాలు సాయపడతాయి. ఫలితంగా రోజంతా శక్తిని కోల్పోకుండా ఉంటారు.

చియా సీడ్స్‌: పోషకాలు నిండుగా ఉండే వీటిల్లో కార్బోహైడ్రేట్‌లూ ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులూ, ఫైబర్‌ రోజంతా శక్తినిస్తాయి.

పాలకూర: ఇందులో ఐరన్‌తోపాటు విటమిన్‌ సి, ఫోలేట్‌ ఎక్కువగా ఉంటాయి.

winter diet
గుడ్లు

గుడ్లు: రుచే కాదు.. ప్రొటీన్‌ ఎక్కువగా దొరికే ఆహారం గుడ్లు. ఇందులోని హెల్తీ ఫ్యాట్స్‌ శరీరాన్ని చురుగ్గా మారుస్తాయి. ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్‌, జింక్‌, విటమిన్‌- ఇ పుష్కలంగా ఉంటాయి. ప్రొటీన్‌తో పాటూ శరీరానికి కావలసినన్ని కెలొరీలూ అందుతాయి. విటమిన్‌ డి, అమైనో ఆమ్లాలూ.. కోల్పోయిన శక్తిని పుంజుకునేలా చేస్తాయి

winter diet
కూరగాయలు

పండ్ల్లు, కూరగాయలు: అన్ని రకాల కూర గాయలూ, పండ్లను తీసుకోవడం వల్ల మినరల్స్‌, విటమిన్‌ సి, ఎ వంటివి దండిగా దొరుకుతాయి. ఇవన్నీ అవసరమైన పోషకాలు అందించి ఆరోగ్యంగా మారుస్తాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.