ETV Bharat / sukhibhava

మెదడు విశ్లేషణతో స్థూలకాయానికి చెక్​ - ఆహారంపై మెదడు నియంత్రణ

రకరకాల ఆహార పదార్థాలను తింటున్నప్పుడు మనకు ఒక అనుభూతి కలుగుతుంది. మనకు ఇష్టమైన ఆహార పదార్థాలైతే ఇంకొంచెం ఎక్కువ తినాలనిపిస్తుంది. కానీ అధిక బరువు, స్థూలకాయ సమస్య కారణంగా కొందరు వాటికి దూరంగా ఉంటారు. అయితే ఇష్టమైన వాటిని కూడా తక్కువగా తినేలా చేసి అధిక బరువు నుంచి కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

fat body
శరీరంలో కొవ్వు
author img

By

Published : Aug 28, 2022, 9:14 AM IST

Obesity control : రకరకాల ఆహార పదార్థాలను తింటున్నప్పుడు మనకు ఒక అనుభూతి కలుగుతుంది. దాన్ని బట్టే వాటిని ఇంకొంచెం వడ్డించుకోవాలా? ఇక అక్కడితో ఆపేయాలా? అన్నది నిర్ణయించుకుంటాం. అయితే, మంచి అనుభూతి కలిగిస్తున్న పదార్థాలను అదేపనిగా, అతిగా తినడం వల్లే చాలామంది అధిక బరువు, స్థూలకాయ సమస్యను ఎదుర్కొంటున్నారు. సరిగ్గా ఈ అంశాన్ని ఆధారం చేసుకునే.. స్థూలకాయ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగాన్‌ శాస్త్రవేత్తలు ఇటీవల వైవిధ్య పరిశోధన సాగించారు.

తిన్న ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు.. దాని పరిమాణం, లక్షణాలు, సంతృప్తి స్థాయికి సంబంధించిన సంకేతాలు మెదడులోని హైండ్‌బ్రెయిన్‌గా పిలిచే భాగానికి చేరతాయి. వీటి ఆధారంగానే అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల్లో వేటిని తినాలి? వేటిని వదిలిపెట్టాలి? ఇంకా ఎంత తినాలి? తినడం ఎప్పుడు ముగించాలి? అన్న నిర్ణయం జరుగుతుంది. ఈ హైండ్‌మ్రెయిన్‌ను మ్యాపింగ్‌ సాంకేతికతతో విశ్లేషించడం ద్వారా.. స్థూలకాయుల ఆహార అనుభూతిలో మార్పులు తీసుకురావచ్చని, తద్వారా ఇష్టమైన వాటిని కూడా తక్కువగా తినేలా చేసి వారిని అధిక బరువు సమస్య నుంచి కాపాడవచ్చని పరిశోధకులు వివరించారు.

ఇవీ చదవండి: న్యూస్​ పేపర్లలో దేశ రహస్య పత్రాలు దాచిన ట్రంప్, ఎఫ్​బీఐ సంచలన నివేదిక

మళ్లీ మోదీనే నంబర్​ వన్​, ప్రపంచ అత్యుత్తమ నేతల్లో టాప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.