స్నానం చేసినప్పుడు, దువ్వినప్పుడల్లా.. తలపై పట్టులాంటి మెత్తటి జుట్టు కుచ్చులుకుచ్చులుగా ఊడిపోతుంటే మనసంతా దిగులు పట్టుకుంటుంది. సబ్బులు, షాంపులు, హెయిర్ ఆయిల్స్ తరచుగా మారుస్తున్నా పెద్దగా ఫలితం ఉండదు. ఇలాంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన మిశ్రమాల సాయంలో పట్టులాంటి జుట్టును కాపాడుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
మిశ్రమానికి కావాల్సినవి:
కోడిగుడ్డు, పెరుగు, అరటిపండు, ఆలీవన్ నూనె, నిమ్మరసం
తయారీ ఇలా:
- రెండు టేబుల్స్పూన్ల పెరుగులో ఒక గుడ్డు పగలగొట్టి వేయాలి.
- దీనికి సగం అరటిపండు, నిమ్మరసం, ఆలీవ్ నూనె ఒక్కోటీస్పూన్ చొప్పున జోడించాలి.
- దీనిలో విటమిన్-ఈ క్యాప్సుల్ కూడా బాగా కలపి మిశ్రమాన్ని తయారు చేయాలి.
ఇలా పట్టించాలి:
- షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ల వరకు పట్టించాలి.
- 15-20 నిమిషాలు అలానే ఉంచి మంచినీటితో శుభ్రం చేసుకోవాలి.
- అంతేకాక మందార ఆకులు, పుష్పాల మిశ్రమాన్ని కూడా జుట్టు పట్టించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
- కరివేపాకు, మైదాకు మిశ్రమాన్ని కూడా వాడొచ్చని ఆయుర్వేదం చెబుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే త్రిఫలాలు తినండి