ETV Bharat / state

టికెట్‌ లేకుండా తిరుపతి దర్శనానికి వెళ్లొచ్చా ? - టీటీడీ ఈవో ఏం అంటున్నారంటే? - TTD EO SHYAMALA AT RAO DIAL YOUR EO

'డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం'లో పాల్గొన్న ఈవో శ్యామలరావు - భక్తుల ఫిర్యాదులు సేకరించిన ఈవో

TTD EO Shyamala Rao At the Dial Your EO Program in Tirupati
TTD EO Shyamala Rao At the Dial Your EO Program in Tirupati (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2024, 4:29 PM IST

TTD EO Shyamala Rao At the Dial Your EO Program in Tirupati : వైకుంఠ ఏకాదశికి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమలలో 91 కౌంటర్ల ద్వారా ప్రత్యేక దర్శనం టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు తెలిపారు. టోకెన్స్‌ కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు ఈవో స్పష్టం చేశారు. రద్దీ నేపథ్యంలో భక్తులంతా టీటీడీ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య భవనంలో నిర్వహించిన 'డయల్ యువర్‌ ఈవో కార్యక్రమం' ద్వారా భక్తుల సందేహాలను తెలుసుకుని సమాధానం ఇచ్చారు.

వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తులకు 10 రోజుల పాటు వసతి కల్పించేలా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరగా ఆలయ ఈవో సానుకూలంగా స్పందించారు. అలాగే నడక మార్గంలో దర్శనం టోకెన్లు ఇవ్వాలని భక్తులు అన్నారు. రైల్వే రిజర్వేషన్‌ను 60 రోజులకు తగ్గించిన నేపథ్యంలో ఆర్జిత సేవల బుకింగ్ సైతం రెండు నెలలకు తగ్గించాలని ఓ భక్తురాలు కోరగా దాన్ని పరిశీలిస్తామని ఈవో చెప్పారు.

సరిగ్గా చెక్ చేస్తారు : తిరుమలలో టీటీడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని, సన్నిధిలో శ్రీవారి సేవకులు, మహిళా ఉద్యోగులను నియమించాలని కోరగా అలా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఈవో శ్యామలరావు తెలిపారు. అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద భద్రత సిబ్బంది లగేజీని సరిగా చెకింగ్‌ చేయడం లేదని ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్‌ లక్కీడిప్‌లో ఇద్దరికి కాకుండా ముగ్గురికి అవకాశం కల్పించాలని భక్తులు కోరగా అలా చేయడం చాలా కష్టమని స్పష్టం చేశారు.

అలా వీలు కాదు : శ్రీవారి దర్శనం టికెట్లు బుక్‌ చేసుకుని రాలేనప్పడు, ఆ టికెట్లను అదే నెలలో మరో రోజు అనుమతించాలని ఈవోకి విజ్ఞప్తి చేయగా అన్ని రోజుల్లో అన్ని స్లాట్లు బుక్‌ అయి ఉంటాయని, అలా మరో రోజు ఇవ్వడానికి వీలు కాదన్నారు.

శ్రీవారి భక్తులకు గుడ్​ న్యూస్​ - వైకుంఠ ద్వార దర్శన తేదీలు వచ్చేశాయ్​

తిరుమలలోని శ్రీ కోదండ రామాలయంలో వచ్చే నెల (జనవరి) 4, 11, 18, 25వ తేదీల్లో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నాలుగు రోజులు ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం తిరిగి సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ ఉండనుంది.

జనవరి 10న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతేక పూజలు నిర్వహించనున్నారు. జనవరి 13న పౌర్ణమి పురస్కరించుకుని ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం, మరుసటి రోజున పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. అమావాస్య సందర్భంగా జనవరి 29న ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం చేయనున్నారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ ఉండనుంది.

ఏడుకొండలవాడికి సుకుమార సేవ- ముత్యపు పందిరిలో గోపాలుడిగా విహారం అందుకే! - Muthyapu Pandiri Vahanam

శ్రీవారి సేవలో అనునిత్యం తరిస్తున్న పూలదండలు - వీటి పేర్లు, కొలతలు తెలుసా? - Tirupati Srivari Garlands

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.