ETV Bharat / sukhibhava

శరీరానికి విటమిన్​ 'మాత్రలు' అవసరమా? - విటమిన్​ టాబ్లెట్లు

ఎ టూ జెడ్‌.. అదే విటమిన్‌ ఎ నుంచి జింక్‌ వరకూ ఎన్నెన్నో మాత్రలు. సిరప్‌లు. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకూ ఎంతోమంది వీటిని వాడుతూనే ఉంటారు. ఇవి చాలవన్నట్టు ప్రొబయోటిక్స్‌, మూలికా ఔషధాలు, చేపనూనె వంటివీ ఎడాపెడా తీసుకుంటూ ఉంటారు. కొవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో ఇటీవల వీటి వాడకం మరింత ఎక్కువైంది కూడా. నిజానికి ఇలాంటి పోషక మాత్రలు అవసరమా? వీటితో పొంచి ఉండే అనర్థాల మాటేమిటి? ఎప్పుడైనా వీటి గురించి ఆలోచించారా?

vitamin tablets side effects
శరీరానికి విటమిన్​ 'మాత్రలు' అవసరమా?
author img

By

Published : Dec 7, 2021, 10:31 AM IST

కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పులు, పిండి పదార్థాలు, నూనెలు, కొవ్వులతో కూడిన పోషకాహారం తగినంత తింటే చాలు. చాలామందికి దీంతోనే అవసరమైన పోషకాలు లభిస్తాయి. కానీ కొందరికి అదనంగా పోషకాల మాత్రలు అవసరమవుతాయి. ఇది ఆయా వ్యక్తుల ఆరోగ్యం, వయసు, ఆహార అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. విటమిన్‌ మాత్రలతో జబ్బులు నయమవుతాయని చాలామంది అపోహ పడుతుంటారు. నిజానికి వీటి ఉద్దేశం- ఆహారం ద్వారా లభించని పోషకాలను భర్తీ చేయటమే.

ఎవరికి కావాలి?

మన శరీరానికి పోషకాల అవసరం, వీటి మోతాదుల విషయంలో వయసు చాలా కీలకం. ఉదాహరణకు- వయసు మీద పడుతున్నకొద్దీ కొన్ని రకాల పోషకాలను గ్రహించుకునే సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. అందుకే వృద్ధులు విటమిన్‌ డి, విటమిన్‌ బి12, క్యాల్షియం వంటి విటమిన్లు, పోషకాలను అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల పదార్థాలు తిననివారికీ ఇవి అవసరం. విటమిన్‌ బి12 మాంసాహారంతోనే లభిస్తుంది. కాబట్టి శాకాహారులకు దీని లోపం తలెత్తకుండా మాత్రలు, సిరప్‌లు సూచిస్తుంటారు. గర్భిణులకు, గర్భధారణకు ప్రయత్నిస్తున్నవారికి ఫోలిక్‌ యాసిడ్‌ అవసరం. ఇది పుట్టబోయే పిల్లల్లో నాడీ లోపాల సమస్యల నివారణకు తోడ్పడుతుంది. శిశువులకు తల్లిపాలతోనే తగినంత విటమిన్‌ డి లభించదు. అందువల్ల అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. గుండెజబ్బు, మధుమేహం, క్యాన్సర్‌, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, కొన్ని స్వీయ రోగనిరోధక సమస్యల వంటి జబ్బులతో బాధపడేవారికి అదనంగా పోషకాలు అవసరమవుతాయి. ఎవరికి ఎలాంటి పోషకాలు, ఎంత మోతాదులో కావాలనేది ఊహించటం కష్టం. దుకాణంలో దొరుకుతున్నాయని ఎవరికివారు కొనుక్కొని వేసుకోవటం తగదు. డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పోషకాలను, తగు మోతాదులో తీసుకోవటం మంచిది. రక్త పరీక్షల ద్వారా ఏయే పోషకాలు లోపించాయో తెలుసుకోవచ్చు.

కీడు చేయకపోవటం ముఖ్యం

విటమిన్‌ మాత్రలు వేసుకునేవారు ఏదైనా చికిత్స కోసం డాక్టర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు ముందే చెప్పాలి. ఎందుకంటే కొన్ని మాత్రలు ఆయా మందుల పనితీరును ప్రభావితం చేయొచ్చు. ఆహారం ద్వారా, మాత్రల ద్వారా ఎంతవరకు పోషకాలు లభిస్తున్నాయో కూడా చూసుకోవాలి. అదనంగా తీసుకుంటే ఏమవుతుందని అనుకోవటానికి లేదు. మోతాదు ఎక్కువైతే కొన్ని పోషకాలు ప్రమాదకరంగానూ పరిణమించొచ్చు. మూలికా ఔషధాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఒంట్లో రకరకాలుగా ప్రభావం చూపొచ్చు. అప్పటికే వాడుతున్న మందుల పనితీరునూ దెబ్బతీయొచ్చు. దుష్ప్రభావాలనూ కలిగించొచ్చు.

రోగనిరోధక శక్తి పెరుగుతుందా?

విటమిన్‌ మాత్రలతో రోగనిరోధకశక్తి పెరుగుతుందన్నది చాలామంది నమ్మకం. ఇది పూర్తిగా నిజం కాదు. విటమిన్‌ సి, విటమిన్‌ డి, విటమిన్‌ ఇ, జింక్‌, సెలీనియం, మెగ్నీషియం వంటివి రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి కీలకమే. కానీ అవసరమైన దానికన్నా ఎక్కువ మోతాదులో తీసుకుంటే రోగనిరోధకశక్తి పుంజుకుంటుందని పరిశోధనల్లో ఎక్కడా బయట పడలేదు. కొవిడ్‌ నివారణకు, నయం కావటానికి తోడ్పడే విటమిన్లు, ఖనిజాలను సిఫారసు చేయటానికి అవసరమైన రుజువులేవీ ఇప్పటివరకూ లభించలేదు.

ఇదీ చూడండి:- తస్మాత్​ జాగ్రత్త- ' ఆ.. ఏమవుతుందిలే' అనుకుంటే ముప్పులో పడ్డట్టే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.