Custard Apple for Sugar Patients: శీతాకాలం ప్రారంభం అయ్యిందంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పండు సీతాఫలం. మామిడి పండ్ల కోసం వేసవి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాళ్లు కొందరయితే, సీతాఫలాల్ని తీసుకొచ్చే శీతాకాలం కోసం ఎదురుచూసేవాళ్లు మరికొందరు. కొండల్లో, కోనల్లో, డొంకల్లో ఈ చెట్లు సులభంగా పెరుగుతాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ పండ్లను ఆవురావురమంటూ తినేస్తుంటారు. ఎందుకంటే ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. అందులోనూ ఇవి సీజనల్‌గా దొరికే పండ్లు కాబట్టి.. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ బి6, కాల్షియం వంటివి ఉంటాయి. అయితే మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినకూడదని అంటుంటారు. అందులో నిజమెంత? అబద్ధమెంత..? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మొటిమల సమస్య - ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి!
డయాబెటిస్ ఉన్నవారు సీతాఫలం తినకూడదా?: ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. అత్యధికంగా భారత్‌లోనే మధుమేహ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి డయాబెటిస్ పెద్ద సమస్యగా మారింది. 30 ఏళ్లు ఉన్నవారిని కూడా మధుమేహం ఇబ్బంది పెడుతుంది. బిజీ లైఫ్ కారణంగా మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఈ షుగర్ వ్యాధికి కారణమని నిపుణులు అంటున్నారు. అయితే డయాబెటిస్ వచ్చిన వారు కొన్ని రకాల ఆహారాలకు చాలా దూరంగా ఉండాలి. అయితే మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినకూడదని కొందరు అంటుంటారు.
కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిస్ పేషెంట్లు ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకుండా సీతాఫలాన్ని తినొచ్చని చెబుతున్నారు. ఈ పండ్లను తిన్నా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగవంటున్నారు. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ 54 మాత్రమే. ఇందులోని పీచు గ్లూకోజ్‌ను రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేస్తుంది. కాబట్టి డయాబెటిస్ వాళ్లు మితంగా తినొచ్చనీ, ఇది ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి, గుండెకి మేలు చేస్తుందనీ చెబుతున్నారు నిపుణులు.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, సిలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండులోని పీచు మలబద్ధకాన్నీ ఇతరత్రా జీర్ణసమస్యల్నీ దూరం చేస్తుంది. నియాసిన్ చెడు కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుంది.
కుక్కలకు పచ్చి మాంసం తినిపిస్తున్నారా? మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే!
Custard Apple Benefits in Telugu: సీతాఫలాల్లో పాలీ ఫెనోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తి, గ్లూకోజ్ శోషణను బాగా పెంచుతాయి. దీంతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది. 100 గ్రాములసీతాఫలంలో 20 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ఇనుము ఇన్సులిన్ ఉత్పత్తిని పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
అంతే కాకుండా సీతాఫలంలోని బులటాసిన్, అసిమిసిన్ అనే ఫ్లేవనాయిడ్లకు క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయనీ, ఆల్కలాయిడ్లూ ఎసిటోజెనిన్‌లు మూత్రపిండ వ్యాధుల్ని తగ్గిస్తాయని పరిశోధనలూ చెబుతున్నాయి. మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉండే సీతాఫలం ఎముక పుష్టినీ పెంచుతుంది. కాబట్టి ఆర్ధ్రయిటిస్ వాళ్లకీ ఈ పండు మేలే. చర్మ సమస్యలకు ఇది మంచి మందు. పచ్చికాయల్ని దంచి ఉప్పువేసి పుండ్లూ గడ్డలమీద పెట్టినా తగ్గుతాయి అంటారు. అందుకే మరి... మధురమైన సీతాఫలం పోషకాలు సమృద్ధిగా ఉన్న ఔషధ ఫలం కూడా!
చపాతీలు మృదువుగా రావాలా? - పిండిలో ఇవి కలిపితే చాలు - భలే స్మూత్‌గా వస్తాయి!
వయసు 40 దాటిందా? - ఈ 7 టిప్స్‌తో యంగ్‌గా కనిపించండి!
హై కొలెస్ట్రాల్ భయపెడుతోందా? - ఉదయాన్నే ఇవి తినండి - లేదంటే అంతే!