ఆధునికత పెరిగే కొద్ది జబ్బులు కూడా అధికం అయ్యాయి. ఒక తరం నుంచి మరో తరానికి వ్యాప్తి (future deseases detection) చెందే జన్యుసంబంధిత రోగాలు (genetic deseases caused by) ఎక్కువయ్యాయి. అయితే.. ఈ వ్యాధులను తర్వాతి తరానికి వ్యాపించకుండా అడ్డుకట్ట వేయాలని (genetic deseases preventions) చాలామంది అనుకుంటారు. తమ పిల్లలకు కూడా ఈ వ్యాధులు వస్తాయా?. తప్పకుండా వస్తాయనుకుంటే.. ముందే గుర్తించే టెస్టులు ఏమైనా ఉన్నాయా? అని తెలుసుకోవాలనుకుంటారు.
పిల్లలు ఓ పదేళ్లు వచ్చేవరకు సాధారణంగా పెరిగి ఉంటే.. సహచర పిల్లలతో సోదరభావం, ఆటపాటలు, చదువులలో ఆసక్తి యథావిధిగా ఉంటే అనుమానపడాల్సిన అవసరం లేదు. అమ్మవైపుగానీ, నాన్నవైపుగానీ తరతరాలుగా బీపీ, షుగర్ లాంటి వ్యాధులు ఉన్నట్లయితే.. వారికి పుట్టిన పిల్లలకు కూడా ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందువల్ల ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ముందు తరాలలో రక్తసంబంధిత వ్యాధులైన తలసేమియా, హీమోఫిలియా వంటి వ్యాధులు, నరాల బలహీనత వంటి జబ్బులు ఉంటే పిల్లల్లో ఐదేళ్లలోపే బయటపడుతుంటాయి. ప్రతి జనరేషన్‌లోనూ సమస్య వెంటాడుతుందంటే.. భవిష్యత్తులో (future desease) పిల్లలకు వచ్చే జబ్బులను ముందే తెలుసుకోవడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనటిక్స్, జెనటిక్ స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల ఎదుగుదల, మానసిక పరివర్తన వంటివి సరిగా ఉన్నాయా? లేదా అనేది ప్రధానంగా చూసుకోవాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:high BP control: హై బీపీని అదుపు చేయటం ఎలా?