ETV Bharat / sukhibhava

Best Yoga Asanas For Memory Improvement : మీ పిల్లల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగాలా?.. ఈ యోగాసనాలతో ఫలితం గ్యారెంటీ! - జ్ఞాపక శక్తి పెంచే యోగాసనాలు ఏమిటి

Best Yoga Asanas For Memory Improvement In Telugu : మీ పిల్లలు చదువులో వెనుకబడుతున్నారా? ఎప్పుడూ దిగులుగా ఉంటున్నారా? అయితే వాళ్లకు యోగాను నేర్పించండి. యోగాభ్యాసం వల్ల మీ పిల్లలు మానసికంగా, శారీరంగా బలంగా, చరుకుగా తయారవుతారు. పైగా వారి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.

Yoga health benefits
Best Yoga Asanas For Memory Improvement
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 7:32 AM IST

Best Yoga Asanas For Memory Improvement : భారతీయ ఋషి పతంజలి వరప్రసాదం యోగా. ఇది శారీరక, మానసిక రుగ్మతలను నయం చేసే గొప్ప సాధనం. ప్రాణాయామం, ధ్యానం, ఆసనాల కలయిక అయిన యోగాను క్రమం తప్పకుండా ఆచరిస్తే.. పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. అందుకే పూర్వం విద్యార్థులందరికీ కచ్చితంగా యోగాను నేర్పించేవారు. ప్రస్తుత కాలంలో పిల్లలు చురుకుగా, హుషారుగా ఉండేందుకు యోగాను నేర్పించడం చాలా మంచిది.

ప్రాణాయామం
Pranayama Benefits : శ్వాసను నియంత్రించే గొప్ప యోగా సాధనం ప్రాణాయామం. ఇది మన శ్వాసను, నాడీ వ్యవస్థను నియంతిస్తుంది. ఫలితంగా మనలో ఉన్న మానసిక ఒత్తిడి సమూలంగా తగ్గుతుంది. పైగా మన ఏకాగ్రతను, బుద్ధి కుశలతను పెంచుతుంది. శారీరకంగానూ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.

Pranayama
ప్రాణాయామం

రక్త ప్రసరణ మెరుగవుతుంది!
యోగా చేస్తే మెదడుతో సహా శరీరమంతా చక్కగా రక్త ప్రసరణ జరుగుతుంది. ఫలితంగా శరీరానికి తగినంత ఆక్సిజన్, పోషకాల సరఫరా చక్కగా జరుగుతుంది. దీని వల్ల దృష్టి, జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది. అందుకే విద్యార్థులు కచ్చితంగా యోగా ఆచరించాలి.

విద్యార్థుల్లో.. ఏకాగ్రత, బుద్ధి, జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏమేమి ఆసనాలు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తాడాసనం :
Tadasana Health Benefits : కాళ్లు రెండూ దగ్గర ఉంచి, నిటారుగా నిలవాలి. అరిచేతులు రెండూ ఒకదానికి ఎదురుగా మరొకటి ఉండేలా పెట్టాలి. ఇలా మీకు వీలైనంత సేపు చేయాలి. ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా సాధన చేస్తే, మీ ఏకాగ్రత బాగా పెరుగుతుంది. పైగా ఎత్తు కూడా పెరుగుతారు.

tadasana
తాడాసనం

వృక్షాసనం :
Vrikshasana Benifits : ఒండి కాలుపై నిల్చుని చేసే ఆసనం ఇది. ఒక కాలుని నేలపై ఆన్చి, మరో కాలుని రెండో కాలి తొడపై ఉంచాలి. చేతులను నమస్కార భంగిమలో ఉంచాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా వృక్షాసనాన్ని సాధన చేయాలి. దీని వల్ల మీ శరీరాన్ని చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతారు. పైగా దృష్టి (ఫోకస్​)ను మెరుగుపరుచుకోగలుగుతారు.

vrikshasana
వృక్షాసనం

పశ్చిమోత్తన ఆసనం
Paschimottan asana Health Benefits : కాళ్లను ముందుకు చాపి కూర్చోవాలి. తరువాత మీ చేతులతో కాలి వేళ్లను తాకాలి. ఇలా వీలైనన్ని సార్లు చేయాలి. ఇలా క్రమం తప్పకుండా ఆసనం వేస్తే వెన్నెముక బలపడుతుంది. మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది.

paschimottanasana
పశ్చిమోత్తన ఆసనం

బాలాసనం
Balasana Benefits : ముందుగా మీరు ముడుకుల మీద కూర్చోవాలి. మీ కాలి మడమలపై మీద పిరుదులు ఉండేలా చూసుకోవాలి. తరువాత చేతులు ముందుకు చాచి తలను నేలకు వాల్చాలి. తరువాత చేతులతో పాదాలను పట్టుకోవాలి. ఈ యోగాసనం మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మెంటల్​ హెల్త్​ను ఇంప్రూవ్ చేస్తుంది.

balasana
బాలాసనం

సర్వాంగ ఆసనం
Sarvangasana Health Benefits : మీరు ముందుగా వెళ్లకిలా పడుకోవాలి. తరువాత కాళ్లను పైకెత్తాలి. మీ చేతులను జాగ్రత్తగా నేలకు ఆన్చండి. ఈ విధంగా ప్రతిరోజూ సర్వాంగ ఆసనం వేస్తే, మెదడుకు చక్కగా రక్త ప్రసరణ జరుగుతుంది. ఫలితంగా జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది.

sarvangasana
సర్వాంగ ఆసనం

హలాసనం :
Halasana Health Benefits : ముందుగా మీరు నేలపై వెళ్లకిలా పడుకోవాలి. తరువాత నెమ్మదిగా రెండు కాళ్లను పైకెత్తి తలమీదుగా నేలను తాకించాలి. చేతులను మాత్రం కాళ్లకు వ్యతిరేక దిశలో నేలకు సమాంతరంగా ఉంచాలి. ఈ విధంగా క్రమంగా తప్పకుండా హలాసనం వేయాలి. వాస్తవానికి నాగలి ఆకారంలో చేసే ఈ ఆసనం వల్ల మన శరీరంలోని నాడీ వ్యవస్థ ప్రేరణ పొందుతుంది. అంతేకాదు మానసిక, శారీరక చురుకుదనం వృద్ధి చెందుతుంది.

halasana
హలాసనం

అనులోమ, విలోమ ప్రాణాయామం
Anulom Vilom Pranayam Health Benefits : నేలపై హాయిగా కూర్చోండి. ఒక్క ముక్కు రంధ్రాన్ని మూసి, మరో ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకోండి. తరువాత ఈ నాసికా రంధ్రాలను మార్చి ఇదే విధంగా శ్వాస తీసుకోండి. ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తే, మీ మెదడు చురుకుదనం బాగా పెరుగుతుంది. పైగా ఫోకస్​ కూడా మెరుగవుతుంది.

సూర్య నమష్కారం
Surya Namaskar Benefits : సూర్య నమష్కారంలో మొత్తం 12 భంగిమలు ఉంటాయి. వీటన్నింటినీ ఒక క్రమపద్ధతిలో చేయాల్సి ఉంటుంది. ఇవి మన శరీరానికి గొప్ప శక్తిని కలగజేస్తాయి. పైగా మానసక ధృఢత్వాన్ని, చురుకుదనాన్ని పెంచుతాయి.

త్రాటక ధ్యానం
Tratak Dhyan Meditation Benefits : ఇది ఒక ప్రత్యేకమైన యోగా. ఒక బిందువు లేదా దీపంపై దృష్టిని కేంద్రీకరించే యోగా టెక్నిక్ ఇది. మనసును నిశ్చలంగా ఉంచడం కోసం, ఏకాగ్రతను నిలపడం కోసం దీనిని పూర్వ కాలంలో సాధన చేసేవారు.

త్రాటక ధ్యానం చేయాలంటే.. అభ్యాసకులు ముందుగా చాలా సౌకర్యవంతమై భంగిమలో కూర్చోవాలి. తరువాత తాము ఎంచుకున్న దీపం లేదా వస్తువులపై తధేకంగా దృష్టి నిలపాలి. వీలైనంత వరకు కనురెప్పలు వేయకుండా చూడాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. దీని వల్ల జ్ఞాపక శక్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది.

Cardamom For Weight Loss : అధిక బరువు, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా?.. యాలకులతో చెక్​!

Vitamin Benefits Chart : సెక్స్ సామర్థ్యం పెంచే విటమిన్ ఏది? వేటితో ఏం ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.