ETV Bharat / sukhibhava

ఉసిరితో జీర్ణసమస్యలు దూరం! ఇంకెన్నో లాభాలు- రోజుకు ఒకటి తింటే చాలు!

Amla Health Benefits In Telugu : విట‌మిన్- సి పుష్క‌లంగా ఉండే వాటిలో ఉసిరి ఒకటి. మ‌న శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. మరి ఉసిరి వ‌ల్ల కలిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలేంటో ఓ సారి చూద్దాం.

Health Benefits Of Amla Full Details In Telugu
Health Benefits Of Amla
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 6:16 PM IST

Amla Health Benefits In Telugu : ఉసిరి- మ‌నం చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తున్న కాయల్లో ఒకటి. ఇది మ‌న‌కు విరివిగా దొరుకుతుంది. కానీ దీనిని మాత్రం చాలా త‌క్కువ‌గా తింటుంటాం. ఎప్పుడూ మ‌న‌కు అందుబాటులో త‌క్కువ ధ‌ర‌లో ఉండే ఈ ఉసిరిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. ఉసిరి చూడ‌టానికి చిన్నగా ఉన్నా కానీ ఇందులోని పోష‌కాహార విలువ‌లు ఎక్కువ‌గానే ఉంటాయి. అలాంటి ఉసిరిని తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మలబద్ధకం దూరం!
చ‌లికాలంలో ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. 100 గ్రాముల తాజా ఉసిరి కాయలు 20 నారింజ​ పండ్ల‌తో స‌మానం. ఉసిరి పండ్ల‌లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్లు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లిగిస్తాయి. ముఖ్యంగా ఇందులో విట‌మిన్- సి ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఎలాంటి అనారోగ్యాల నుంచైనా సులువుగా కోలుకోవచ్చు. ఇందులోని ఫ్లావ‌నాయిడ్స్ ర‌సాయ‌నాలు జ్ఞాప‌క శ‌క్తిని పెంచ‌డంలో ఉప‌యోగప‌డతాయి. వీటిలో నీటిలో క‌రిగే కొవ్వు ఉండ‌టం వ‌ల్ల అది ర‌క్తంలో చక్క‌ెర తొంద‌ర‌గా క‌ర‌గ‌కుండా చేస్తుంది. దీంతో ర‌క్తంలో షుగ‌ర్​ స్థాయులు అదుపులో ఉంటాయి. ఉసిరిలో ఉండే పీచు ప‌దార్థం మ‌ల‌బద్ధ‌కం స‌మ‌స్య‌నూ దూరం చేస్తుంది.

ఎన్నో ఆరోగ్య లాభాలు!
నారింజతో పోలిస్తే- ఉసిరిలో విట‌మిన్- సి ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మ‌న రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డ‌మే కాకుండా చ‌ర్మం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్ప‌డుతుంది. మ‌న శ‌రీరానికి హాని చేసే ఫ్రీ రాడిక‌ల్స్, ఇత‌ర క‌ణాల్ని తొల‌గించ‌డంలో ఉసిరి సాయప‌డుతుంది. శరీరం లోపల జ‌రిగే న‌ష్టాల నుంచి కోలుకోవ‌డానికి ఉసిరి సాయం చేస్తుంది. ఉసిరిలో ఉండే పీచు ప‌దార్థం జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఎండు ఉసిరి లేదా పౌడ‌ర్ రూపంలో ఉన్న ఉసిరి సైతం తీసుకోవ‌చ్చు. రోజూ ఉసిరిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు సి-విట‌మిన్​ లోపం రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా క‌ళ్లు, జుట్టు, చ‌ర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

విటమిన్​-ఏ కూడా!
ఆహారం తిన్న త‌ర్వాత ఉసిరిని తింటే జీర్ణ సంబంధ‌మైన స‌మస్య‌లు దూర‌మ‌వుతాయ‌ని పోష‌కాహార నిపుణులు శుభాంగి త‌మ్మ‌ళ్వార్‌ చెబుతున్నారు. విట‌మిన్​-సి కంటి సంబంధిత వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. ఆ ర‌కంగా ఉసిరిలో అధిక శాతంలో ఏ-విట‌మిన్ కూడా ఉండ‌టం వ‌ల్ల క‌ళ్ల‌కు మేలు జ‌రుగుతుంది. రోజుకి 20 మిల్లిలీటర్ల ఆమ్లా జ్యూస్ లేదా 1-2 టేబుల్ స్పూన్ల ఎండు ఉసిరిని తీసుకోవ‌చ్చు. ముఖ్యంగా పిల్ల‌ల చేత ఉసిరిని తినిపించ‌డం వ‌ల్ల చ‌లికాలంలో వ‌చ్చే జ‌లుబు, ద‌గ్గు లాంటి స‌మ‌స్య‌లు రాకుండా నివారించ‌వ‌చ్చు.

రోజూ ఒక ఉసిరి- ఆరోగ్య సిరి!
ఉసిరిలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ మిశ్ర‌మాలుంటాయి. వంద గ్రాముల ఉసిరిలో 300 మిల్లీగ్రాముల విట‌మిన్​-సి విలువ‌లుంటాయి. మహిళల్లో అయితే నెల‌స‌రి స‌మ‌స్య‌లు త‌గ్గించ‌డం, ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ స‌క్ర‌మంగా ప‌నిచేయ‌డంలో ఉసిరి సాయ‌ప‌డుతుంది. రోజూ ఒక ఉసిరి కాయ తింటే క‌ఫం స‌మ‌స్య‌లు త‌గ్గుతాయని, ప‌రగ‌డుపున ఒక స్పూను ఉసిరి పొడిని నీళ్ల‌లో క‌లుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయ‌ని వైద్యులు అంటున్నారు.

ఉసిరికాయతో జీర్ణసమస్యలు దూరం! జుట్టు, చర్మం మరింత ఆరోగ్యంగా!

మీ పిల్లలు నిత్యం నవ్వుతూ ఉండాలా? - అయితే ఈ 5 విషయాలు చెప్పండి!

మీ పిల్లలు రోజూ బ్రష్ చేస్తున్నారు కరక్టే - ఇలా చేస్తున్నారా? - లేదంటే పుచ్చిపోవడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.