వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణను సిట్ అధికారులు ముమ్మరం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన కొంతమంది... అనుమానితులను కడపకు పిలిచి విచారణ చేశారు. వైకాపా నుంచి ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి, మరో వ్యక్తిని విచారణకు హాజరుకావాల్సిందిగా కోరారు. తెదేపా నుంచి శివరామిరెడ్డి, మరో వ్యక్తిని సిట్ అధికారులు విచారించారు. అనుమానితుల విచారణ మరో 10 రోజులు ఉంటుందని కడప ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు.
సంబంధిత కథనాలు