ETV Bharat / offbeat

శనగపిండి లేకుండా నోరూరించే "సగ్గుబియ్యం మురుకులు" - ఇలా చేస్తే నూనె తక్కువ, రుచి ఎక్కువ! - SABUDANA MURUKULU RECIPE

టేస్టీగా ఉండే "సగ్గుబియ్యం మురుకులు" - ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు!

SAGO MURUKKU RECIPE
Saggubiyyam Murukulu Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2025, 10:09 AM IST

Saggubiyyam Murukulu Recipe in Telugu : వినోదాలను పంచే సంబురాల సంక్రాంతి వచ్చేస్తోంది. ఈ పండగ వేళ ఇంటింటా ఘుమఘుమలాడే పిండి వంటలు నోరూరిస్తాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో ఎక్కువగా సకినాలు, గర్జలు, అరిసెలు, మురుకులు ఇలా రకరకాల పిండి వంటలు చేసుకుంటుంటారు. అయితే, ఈ సంక్రాంతికి ఎప్పుడూ చేసుకునే మురుకులు కాకుండా కాస్త డిఫరెంట్​గా సగ్గుబియ్యంతో ట్రై చేయండి. శనగపిండి వాడకుండా చేసుకునే ఇవి చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. నూనె కూడా తక్కువ పీల్చుకుంటాయి. ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతాయి. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • సగ్గుబియ్యం - అర కప్పు
  • పెసరపప్పు - 1 కప్పు
  • బియ్యప్పిండి - 3 కప్పులు
  • వాము - ఒకటిన్నర టీస్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - రుచికి తగినంత
  • తెల్ల నువ్వులు - 2 టేబుల్​స్పూన్లు
  • వేడి నూనె/నెయ్యి - 2 టేబుల్​స్పూన్లు
  • నూనె - డీప్​ ఫ్రైకి తగినంత

తెలంగాణ స్పెషల్ "సకినాలు, బియ్యప్పిండి మురుకులు" - ఇలా చేస్తే గుల్లగా కరకరలాడుతూ సూపర్ టేస్ట్!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై పాన్ పెట్టి సగ్గుబియ్యం, పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్ మీద సుమారు 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లార్చుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసుకొని మెత్తని పౌడర్​లా గ్రైండ్ చేసుకోవాలి.
  • అనంతరం ఒక మిక్సింగ్ బౌల్​లో మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పొడిని జల్లెడలోకి తీసుకొని జల్లించుకోవాలి. పిండి మెత్తగా ఉండేలా చూసుకోవాలి.
  • ఆవిధంగా పిండిని రెడీ చేసుకున్నాక అందులో బియ్యప్పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఆపై ఆ మిశ్రమంలో వామును చేతితో బాగా నలిపి వేసుకోవాలి. అలాగే ఉప్పు, కారం, తెల్ల నువ్వులు వేసుకొని పిండి మొత్తం చక్కగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఒకవేళ నువ్వులు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. అలాగే, ఈ స్టేజ్​లో ఒకసారి చేతిలోకి కొద్దిగా తీసుకొని ఉప్పు, కారం సరిపోయిందా? లేదా? అని చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకొని కలుపుకోవాలి.

షుగర్ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినొచ్చు! - "జొన్న మురుకులు" చేసుకోండిలా!

  • అనంతరం పిండిలో వేడివేడి నూనె లేదా నెయ్యిని వేసుకొని ముందుగా గరిటెతో కలుపుకోవాలి. ఆపై చల్లారాక చేతితో పిండి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మురుకులు గుల్లగా, క్రిస్పీగా వస్తాయి.
  • ఆ తర్వాత తగినన్ని వాటర్​ని కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. అయితే, మరీ గట్టిగా కాకుండా కాస్త లూజ్​గానే ఉండేటట్లు పిండిని కలుపుకోవాలి.
  • ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని లోపల కాస్త నూనె రాసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఒక పొడి క్లాత్​పై మురుకుల్లా ఒత్తుకోవాలి.
  • అనంతరం స్టౌపై కడాయి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ముందుగా ఒత్తుకున్న మురుకులను గరిటెతో ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
  • ఆపై మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఈవిధంగా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
  • అవి చల్లారాక ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే చాలు. అంతే, కరకరలాడుతూ ఎంతో రుచికరంగా ఉండే "సగ్గుబియ్యం మురుకులు" రెడీ!

బియ్యప్పిండితో జంతికలు చేస్తే గట్టిగా వస్తున్నాయా? - ఇలా ట్రై చేస్తే కరకరలాడుతూ గుల్లగా వస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.