ETV Bharat / state

నేతన్నలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక - ఓకే సారి మూడు పథకాల ప్రకటన - అవేంటంటే - CHENETHA ABHAYA HASTHAM SCHEME

తెలంగాణ నేతన్నలకు ప్రభుత్వం కానుక - మూడు పథకాల ప్రకటన - 11,041 మంది కార్మికులకు లబ్ధి

Telangana Chenetha Abhaya Hastham Scheme
Telangana Chenetha Abhaya Hastham Scheme (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2025, 10:22 AM IST

Telangana Chenetha Abhaya Hastham Scheme : రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు సంక్రాంతి కానుక ప్రకటించింది. తెలంగాణ చేనేత అభయ హస్తం పథకం పేరుతో మూడు పథకాలను ప్రారంభిస్తున్నట్లు ఆయా జిల్లాల చేనేత, జౌళిశాఖ అధికారులకు సర్కార్​ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ శనివారం సీఎం రేవంత్​ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

నేతన్నకు భరోసా : మహబూబ్​నగర్ జిల్లా వ్యాప్తంగా 3,503 జియోట్యాగ్​ మగ్గాలున్నాయి. వీటిపై గద్వాల, నారాయణపేట రకం చీరలను కార్మికులు నేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ పేరుతో ఉన్న ఉత్పత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మార్క్​ లేబుల్​ను అందిచనుంది. ఈ లేబుల్​ ఉన్న ప్రధాన కార్మికులకు ఏడాదికి రూ.18వేలు, అనుబంధ కార్మికుని రూ.6వేలు అందించనుంది.

Telangana Chenetha Abhaya Hastham Scheme
సీఎం చిత్రపటానికి పూలమాల వేసి కృతజ్ఞత తెలిపిన చేనేత కార్మికులు (ETV Bharat)

నేతన్న పొదుపు : గతంలో నేతన్నకు చేయూత పథకం పేరుతో కార్మికులు 8 శాతం బ్యాంకులో ఖాతాలో జమ చేస్తే ప్రభుత్వం 16 శాతం సొమ్మును జమ చేసింది. గత సెప్టెంబరు వరకు అమలైన ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాలోని 9,612 మంది కార్మికులకు రూ. 66.49 కోట్లు ఇచ్చారు. కాగా తాజాగా ఈ పథకాన్ని తెలంగాణ నేతన్న పొదుపు పేరుతో అమలు చేయనున్నారు. గతంలో మూడేళ్ల కాల వ్యవధి ఉన్న ఈ పథకాన్ని ప్రస్తుతం రెండేళ్లకు తగ్గించారు. దీని ద్వారా అరకొర కూలీ వేతనాలతో కాలం గడుపుతున్న 11,041 మంది చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది.

జీవిత కాల ఉచిత బీమా : కార్మికుల జీవిత కాల బీమా అందించనున్నట్లుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించగా తాజాగా ఈ పథకం కోసం రూ.9 కోట్లు కేటాయించింది. 18 సంవత్సరాలు నిండిన కార్మికులు ఏ కారణం చేత మరణించినా వారి కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పునా బీమా అందించనున్నారు. 59 ఏళ్ల లోపు వారికి ఎల్​ఐసీ ద్వారా, ఆపై వయసున్న వారికి టెస్కో ద్వారా ఎక్స్​గ్రేషియా చెల్లించనున్నారు.

నేతన్నకు కరవైన చేయూత - ఆధునిక యంత్రాలతో పోటీ పడలేక ఛిద్రమైన జీవితం - Story On NATIONAL HANDLOOM DAY 2024

రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ ప్రక్రియలో మంత్రులు కూడా భాగస్వాములు కావాలి : భట్టి - Deputy CM Bhatti on Annual Budget

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.