యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి హాజరుకానుందున ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను జడ్పీ దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు బాధ్యతాయుతంగా పనులు చేయాలని ఎంపీ తెలిపారు.
మల్లాపూర్లో సుమారు 40 ఎకరాల భూమిని ఆక్రమించారని.. దానిపై అధికారులు దృష్టి సారించాలని ఎంపీపీ శ్రీశైలం ఆరోపించారు. మండలాలకు చెందిన సమస్యలను ఎంపీపీలు ఒక్కొక్కరిగా వివరించారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని జడ్పీ ఛైర్మన్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండిః దిశ నిందితుడి భార్యకు 13 ఏళ్లే!...ఆమె 6 నెలల గర్భవతి