కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ... రానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను నిరాడంబరంగా జరుపుకోవాలని యాదగిరిగుట్ట ఏసీపీ నర్సింహరెడ్డి సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒక ఊరు- ఒకే గణపతి అనే నినాదంతో ముందుకు సాగాలని తెలిపారు. విఘ్నేశ్వరుడి విగ్రహం ఎత్తు 3 ఫీట్లకు మించరాదని పర్యావరణ హితం కోరుతూ... మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలన్నారు.
ప్రజారక్షణే పోలీసుల ధ్యేయమని... ఉత్సవ కమిటీలు యువజన సంఘాలు సహకరించాలని తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి నిబంధనలు రూపొందిస్తామని ఏసీపీ నర్సింహారెడ్డి తెలిపారు.