ETV Bharat / state

యాదాద్రి ప్లాంట్ పర్యావరణ అనుమతుల జారీపై పీటముడి - ప్రజాభిప్రాయ సేకరణకు కేంద్రం ఆదేశం - ఆన్‌లైన్‌ ప్రజాభిప్రాయ కోసంఎన్జీటీకీ జెన్‌కో వినతి

Yadadri Thermal Power Plant : యాదాద్రి థర్మల్‌ విద్యుత్ కేంద్రానికి మరోసారి పర్యావరణ అనుమతి విషయంలో చిక్కుముడి వీడలేదు. గ్రామసభలు పెట్టి మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని కేంద్ర పర్యావరణశాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈసీ జారీ ఆంశం మళ్లీ మొదటికొచ్చింది. ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు అనుమతించాలంటూ జెన్‌కో ఎన్జీటీని ఆశ్రయించింది. ట్రైబ్యునల్‌ విచారణ జరిపి తీర్పు ఇచ్చేదాకా ప్లాంటు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

Yadadri Thermal Power Plant Environmental Issues
Yadadri Thermal Power Plant
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 12, 2023, 8:19 AM IST

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి వీడని చిక్కుముడి - మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలంటూ ఎన్జీటీ ఆదేశాలు

Yadadri Thermal Power Plant : యాదాద్రి విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతిపై కేంద్రం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈసీ జారీ చేయాలంటే ఈ కేంద్రం నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనేది తెలుసుకునేందుకు మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిందేనని కేంద్ర పర్యావరణశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ కేంద్రానికి పర్యావరణ అనుమతి అంశంలో మరోసారి చిక్కుముడి పడింది.

Yadadri Thermal Power Plant Environmental Issues : క్షేత్రస్థాయికి వెళ్లి గ్రామ సభలు పెట్టాలంటే అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి అనుమతించాలంటూ రాష్ట్ర జెన్‌కో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ని ఆశ్రయించింది. ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు గతంలో కేంద్ర పర్యావరణశాఖ జారీచేసిన మార్గదర్శకాలున్నందున ఎన్జీటీ కూడా సానుకూలంగా స్పందించవచ్చన్న ఆశాభావంతో జెన్‌కో ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఈ కేంద్రం నిర్మాణం అనుకున్న గడువుకన్నా రెండేళ్లు దాటడంతో అంచనా వ్యయం 29 వేల 500 కోట్ల నుంచి 34 వేల 500 కోట్లకు పెరిగింది.

Yadadri Power Plant TOR Issue : యాదాద్రి ప్లాంట్ టీఓఆర్ జారీపై నెలకొన్న అనిశ్చితి.. థర్మల్ విద్యుత్​కు మోక్షం ఎప్పుడో..?

Yadadri Power Plant TOR Issue : వాస్తవానికి యాదాద్రి ప్లాంటుకు గతంలోనే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు జారీచేసింది. దాని ప్రకారం విద్యుత్ కేంద్రం నిర్మాణం కూడా చాలామేర పూర్తయింది. అయితే ఈ కేంద్రం నుంచి వెలువడే కాలుష్యం వల్ల ఆమ్రాబాద్‌ అభయారణ్యంలో వన్యప్రాణులపై తీవ్ర ప్రభావం పడుతుందని, కేంద్రం జారీచేసిన ఈసీని రద్దుచేయాలంటూ ముంబయికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ గత ఏడాది ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేసింది. బొగ్గును మండించి విద్యుదుత్పత్తి చేసే థర్మల్‌ కేంద్రం అభయారణ్యానికి కనీసం 10 కిలోమీటర్ల ఎయిర్‌ డిస్టెన్స్‌లో ఉండాలని కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలున్నాయి.

అంతకన్నా తక్కువ దూరంలోనే నిర్మిస్తున్నట్లు ఆ సంస్థ ఆరోపించింది. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్‌ గతంలో జారీచేసిన అనుమతులను రద్దుచేసి మరోసారి అధ్యయనం చేసి 9 నెలల్లోగా కొత్తగా జారీచేయాలని గత ఏడాది సెప్టెంబరులో తీర్పు చెప్పింది. ఆ గడువు ఈ ఏడాది జూన్‌తో ముగిసినా కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వలేదంటూ అక్టోబరులో జెన్‌కో మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించించింది.

విద్యుత్‌ శాఖ అప్పు 81,516 కోట్ల రూపాయలు - ముఖ్యమంత్రికి ప్రజంటేషన్‌ ఇచ్చిన అధికారులు

Yadadri Thermal Power Plant Environmental Issues : దీంతో నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలంటూ గత నెలలో ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈసీ జారీకి టీఓఆర్​ను నిర్దేశిస్తూ నివేదిక పంపాలని జెన్‌కోను కేంద్ర పర్యావరణశాఖ ఆదేశించింది. నిబంధనల్లో ప్రధానంగా యాదాద్రి ప్లాంటు ప్రహరీకి ఎంత వాయు దూరంలో ఆమ్రాబాద్‌ అభయారణ్యం సరిహద్దు ఉందనేది తేలాలి. రాష్ట్ర అటవీశాఖ నిపుణులు జరిపిన తాజా సర్వేలో ఈ సరిహద్దు ప్లాంటుకు 14.3 కిలోమీటర్ల వాయుదూరంలో ఉందని తేలడంతో ఇదే నివేదికలో పంపాలని జెన్‌కో నిర్ణయించింది.

గతంలో ఈసీ జారీ చేసినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేసినందున, మరోసారి ప్రజల వద్దకు వెళ్లి చేయలేమని, ఆన్‌లైన్‌కు అనుమతించాలని జెన్‌కో ట్రైబ్యునల్‌ను కోరింది. తీర్పు అనుకూలంగా వస్తేనే ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ సాధ్యమవుతుంది. ఇవన్నీ జరిగి మళ్లీ ఈసీ రావడానికి మరో 3 నుంచి 4 నెలలు పట్టే అవకాశముందని, అప్పటిదాకా విద్యుదుత్పత్తి ప్రారంభం కాకపోవచ్చని అధికారులు అంచనావేస్తున్నారు.

ఆ అంశాలపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు నివేదిక పంపాలని జెన్​కో నిర్ణయం

Yadadri thermal power plant: యాదాద్రి వెలిగేదెప్పుడో.. నత్తనడకన థర్మల్ విద్యుత్​ కేంద్రం పనులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.