యాదాద్రి క్షేత్రాభివృద్ధిలో భాగంగా కొండ కింద గాలిగోపురం( వైకుంఠ ద్వారం) వద్ద మెట్ల దారుల నిర్మాణం చేపట్టారు. కొండెక్కే మార్గం మొదలయ్యే గోపురం వద్ద ఇరువైపులా మెట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటి ఆధారంగా గతంలోని వైకుంఠ ద్వారం తొలగించి నూతనంగా గాలిగోపురం నిర్మించారు.
కొండ చుట్టూ వలయ దారి నిర్మాణం దృష్ట్యా గాలిగోపురం చెంత ఇరువైపులా మెట్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. యాడా చేపట్టిన ఈ పనులను ఆర్ అండ్ బీ శాఖ పర్యవేక్షిస్తోంది. కాలినడకన ఆలయానికి వెళ్లే భక్తులు గాలి గోపురం చెంత ఆది పూజలు నిర్వహించే ఆచారం మేరకు నిజ పాదాల ఏర్పాటుకు అధికారులు యోచిస్తున్నారు.