ETV Bharat / state

పసికందు కిడ్నాప్​ కేసును ఛేదించిన యాదాద్రి పోలీసులు - DCP

భర్తతో గొడవపడి పాపను తీసుకొని ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఓ జంట చెప్పిన మాయమాటలు నమ్మి వారింటికి వెళ్లింది. మూడు రోజుల పాటు మద్యం మత్తులో ఉండి తన కూతురిని పోగొట్టుకుంది. 20 రోజుల క్రితం ఈ ఘటన జరగగా.. పోలీసుల రంగప్రవేశంతో పాప క్షేమంగా తల్లి ఒడికి చేరింది.

పసికందు కిడ్నాప్​ కేసును ఛేదించిన యాదాద్రి పోలీసులు
author img

By

Published : Sep 23, 2019, 1:17 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 రోజుల క్రితం కిడ్నాప్​కు గురైన 14 నెలల పసి కందు పూజ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు బీబీనగర్​కి చెందిన గుజ్జర రాజు, పిట్టల మాధవి అని డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. వీరిద్దరూ రైల్వే స్టేషన్ పరిసరాల్లో చిత్తు కాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్​ ఎల్బీనగర్​లో నివసించే ఓ మహిళ భర్తతో గొడవపడి తన పాపని తీసుకొని బీబీనగర్ రైల్వే స్టేషన్​కు చేరుకుంది. విషయం గమనించిన నిందితులు మహిళకు మాయమాటలు చెప్పి వారింటికి తీసుకెళ్లారు. మూడు రోజులు పాటు ఆమెతో మద్యం తాగించి పాపని తీసుకొని హైదరాబాద్ పారిపోయారు. బాధిత మహిళ మత్తులో నుంచి మేల్కొని తాను మోసపోయినట్లు గుర్తించింది. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత 20 రోజులుగా పోలీసులు ప్రత్యేక బలగాలతో గాలిస్తున్నారు. ఈ రోజు ఉదయం నిందితులను పట్టుకొని పాపని తల్లి ఒడికి చేర్చారు. కిడ్నాప్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఛేదించిన పోలీసులను డీసీపీ నారాయణ రెడ్డి అభినందించారు.

పసికందు కిడ్నాప్​ కేసును ఛేదించిన యాదాద్రి పోలీసులు

ఇవీ చూడండి: బస్సు టైర్​ పంచర్​.. మెట్రో పిల్లర్​కు ఢీ

TG_NLG_61_23_YADADRIDCP_PC_AB_TS10061 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 నెలల పసి కందు పూజ కిడ్నాప్ కేసు నుజిల్లా పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించి వివరాలు యాదాద్రి భువనగిరి జిల్లా డిసిపి నారాయణ రెడ్డి మీడియా కు వెల్లడించారు. నిందితులు బీబీనగర్ కి చెందిన గుజ్జర రాజు, పిట్టల మాధవి బీబీనగర్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో చిత్తు కాగితాలు, స్క్టాప్ ఎరుకొని జీవనం సాగిస్తున్నారు. హైద్రాబాద్, ఎల్ బి నగర్ లో నివసించే ఓ మహిళ భర్త తో గొడవపడి పాప తో సహా బీబీనగర్ రైల్వే స్టేషన్ వద్ద కు వద్దకు చేరుకోగా, సదరు మహిళకు నిందితులు రాజు, మాధవి మాయమాటలు చెప్పి వారింటి తీసుకెళ్లారు. తనకు మూడు రోజులు మద్యం తాగించి నిందితులిద్దరు పాప ను తీసుకొని హైదరాబాద్ వెళ్లిపోయారు. పాప తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రత్యేక పోలీసుల టీం గాలింపు తో నిందితులిద్దరినీ ఈ రోజు ఉదయం పట్టుకున్నారు. 20 రోజుల తరువాత పాప ను క్షేమంగా తల్లి వద్ద కు జిల్లా పోలీసులు చేర్చారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను డిసిపి నారాయణ రెడ్డి అభినందించారు. బైట్ : నారాయణ రెడ్డి (డిసిపి, యాదాద్రి భువనగిరి జిల్లా)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.