ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో నృసింహ జయంతి ఉత్సవాలను వైభవంగా జరుపుతున్నారు. ఉత్సవాలలో మొదటి రోజు భాగంగా ఈ రోజు ఉదయం తిరు వెంకటపతి అలంకరణలో స్వామివారిని బాలాలయంలో ఊరేగించారు.
స్వామివారిని వజ్ర వైడూర్యాలతో, వివిధ రకాల పుష్పాలతో నయనమనోహరంగా అలంకరించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు... వేదపండితుల వేదపారాయణాల నడుమ స్వామి వారి ఊరేగింపు కన్నులపండువగా సాగింది. లాక్డౌన్ కారణంగా ఆలయంలోకి భక్తులెవరినీ అనుమతించలేదు. అర్చకులు కుడా భౌతిక దూరం పాటిస్తూ... పూజలను నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి: హైదరాబాద్లో ఒక్క రోజులోనే 20 కేసుల