ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి జయంతి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బాలాలయం, పాతగుట్ట ఆలయంలో జరిగే జయంతి ఉత్సవాలు భౌతిక దూరం పాటిస్తూ ఏకాంత సేవలో నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
నేడు స్వస్తివాచనం, గరుడ వాహన సేవలతో స్వామి వారి జయంతి పూజలు ప్రారంభించనున్నారు. 5వ తేదీన అభిషేకం, నవకలశ స్నాపనం, హనుమంత సేవ... 6వ తేదీన పూర్ణాహుతి, సహస్ర ఘటాభిషేకం, నరసింహ స్వామి ఆవిర్భావం, తీర్థ ప్రసాద గోష్టి చేయనున్నారు. భక్తులందరు ఆన్ లైన్ ద్వారా పూజలను వినియోగించుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి మోస్తారు వర్షాలు...!