Yadadri Temple Karthika Masam Income: పవిత్ర కార్తిక మాసంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. కొండ కింద నూతన వ్రత మండపంలో ప్రతి రోజు ఆరు బ్యాచ్‌లుగా వ్రతాలు నిర్వహిస్తున్నారు. 21,480 దంపతులు శ్రీ సత్యనారాయణస్వామి వ్రత పూజలు ఆచరించారు. మొత్తం 23 రోజుల్లో వివిధ విభాగాలు కలుపుకొని రూ.14,66,38,097 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎన్.గీతారెడ్డి తెలిపారు.
గత ఏడాది 19,176 వ్రత పూజలు నిర్వహించగా.. వివిధ విభాగాలు కలుపుకొని మొత్తం రూ. 7,35,10,307 ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుత మాసం రూ.7,31,27,790 ఆదాయం అదనంగా సమకూరింది. యాదాద్రి ఆలయ పునః ప్రారంభం అనంతరం స్వయంభువులను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో యాదాద్రికి తరలివస్తున్నారు.
ఇవీ చదవండి: