యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట నుంచి వంగపల్లికి వెళ్లే మార్గంలో రహదారి గోతులమయమైంది. యాదగిరిగుట్ట మండలం(yadagirigutta mandal) పెద్దకందుకూరు గ్రామస్థులు.. తమ ఊరిలో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఏళ్లు తరబడి పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నారు(pedda kandukuru road damaged ). ఈ దారిగుండానే జిల్లా కేంద్రానికి, హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారికి(hyderabad Warangal national highway) వెళ్లేందుకు దగ్గరగా ఉంటుంది. నిత్యం ఈ మార్గం లో వందల మంది ప్రయాణిస్తారు. గోతులపడిన రోడ్డులో ఇక్కట్లు పడుతూనే ప్రయాణాలు సాగిస్తున్నారు.
ఈ రోడ్డుపై ప్రయాణం కత్తిమీదసామే..
పాలకులకు, ప్రభుత్వాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందన కరవైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. రాత్రి వేళల్లో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే కత్తిమీదసాములా ఉంటుందని.. (road damaged)కొన్ని సార్లు అదుపుతప్పి పడిపోయిన ఘటనలు ఉన్నాయంటున్నారు స్థానికులు.
పెద్దకందుకూరు నుంచి యాదగిరిగుట్ట రోడ్డు వరకు రహదారి దుర్బరంగా ఉంది. ఈ రోడ్డుపై వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ మార్గంలోనే చాలా మంది యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. సమీపంలో ఉన్న ఫ్యాక్టరీలకు ఈ దారిలో వెళ్తేనే దగ్గరగా ఉండడం వల్ల నిత్యం రద్దీగా ఉంటుంది. సుమారు పదిగ్రామాల ప్రజలు ఈ రోడ్డుపైనా ప్రయాణాలు సాగిస్తారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గతంలో చాలా సార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతిపత్రాలు అందించాం. గర్భిణులు, చిన్నపిల్లలు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గోతుల రోడ్డులో ముందుకు సాగాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ రోడ్డు గ్రామ పంచాయతీ పరిధిలో లేదని చెబుతూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. - భీమగాని రాములు,పెద్ద కందుకూరు గ్రామ సర్పంచ్.
వాహనాలు పాడైపోతున్నాయి
గుంతలమయంగా మారిన పెద్దకందుకూరు రోడ్డులో ప్రయాణం నరకప్రాయం. చుట్టుపక్కల గ్రామాల వారు, యాదాద్రికి వచ్చే భక్తులు ఈరోడ్డుగుండానే వెళ్తుంటారు. రోడ్డు మొత్తం ధ్వంసమైంది. ఈరోడ్డులో ప్రయాణించడం వల్ల వాహనాలు కూడా పాడైపోతున్నాయి. వాహనం నడిపేటప్పుడు అదుపుతప్పి పడిపోవడం, రోడ్డు ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. యాదాద్రిని అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం... యాదాద్రికి కనెక్టివిటీగా ఉన్న ఈ రోడ్డును బాగుచేయాలని కోరుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలి. - స్థానికుడు.
అధికారులు ఏమంటున్నారు
ఈ రోడ్డు మరమ్మతుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని ఆర్ అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. నిధులు విడుదల కాగానే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. త్వరలోనే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
ఇదీ చూడండి: మూడేళ్లలో రోడ్డు ప్రమాదాలకు 3.92 లక్షల మంది బలి!