ETV Bharat / state

వేగంగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం తుది దశకు చేరుకుంటోంది. వచ్చే దసరా నాటికి ప్రధాన గుడితోపాటు అనుబంధ ఆలయాల నిర్మాణాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. ఇప్పటికే సప్త రాజగోపురాల పనులు పూర్తి కాగా శివాలయం, వ్రత మండప నిర్మాణాలు వేగవంతమయ్యాయి.

పునర్నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసుకుంటోన్న యాదాద్రి క్షేత్రం
author img

By

Published : Jul 10, 2019, 8:06 AM IST

Updated : Jul 10, 2019, 9:40 AM IST

వేగంగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు

సప్త రాజగోపురాలతో కొలువుదీరనున్న పంచనారసింహ క్షేత్రం పునర్నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసుకుంటోంది. కాకతీయుల శిల్పకళ ఉట్టిపడేలా ప్రధానాలయం పూర్తిగా కృష్ణ శిలతో తయారవుతోంది. సప్త రాజగోపురాలతోపాటు మాడ వీధులు, అష్టభుజి ప్రాకార మండపాల పనులు పూర్తయ్యాయి. గర్భాలయం ఎదుట పన్నెండు మంది ఆళ్వారులతో కూడిన మహా ముఖ మండపం, దివ్యవిమాన గోపురం ఇప్పటికే పూర్తైంది.

తిరుపతి నుంచి జయవిజయుల విగ్రహాల తరలింపు

గర్భాలయ ద్వారానికి 17 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పుతో కూడిన రెండు తలుపులను బిగించారు. పద్మం, స్వామి వారి రూపాలతో కూడిన నగీషీలను తలుపులకు పొందుపరుస్తారు. వేంచేపు మండపం నిర్మాణ దశలో ఉండగా ఆలయం లోపల ఆంజనేయస్వామి, శ్రీలక్ష్మీనృసింహుడు, జయవిజయుల విగ్రహాలు చూపరులను ఆకట్టుకోనున్నాయి. 10 అడుగులతో కూడిన జయవిజయుల విగ్రహాలను తిరుపతి నుంచి, నాలుగు ఐరావతాలను మహాబలిపురం నుంచి యాదాద్రికి తరలించారు.

కలశాల తయారీకి 3800 కిలోల రాగి, ఇత్తడి లోహాలు

నిర్మాణంలో సిమెంట్, ఇటుకకు భిన్నంగా సున్నం, బెల్లం, కరక్కాయ మిశ్రమాలను విస్తరణ పనులకు వాడారు. గర్భాలయ ప్రవేశ ద్వారంపై దక్షిణ దిశలో భక్తులను తన్మయత్వానికి గురిచేసేలా శంకు చక్ర నామాలు, ప్రహ్లాద చరిత్రను తెలిపేలా వెండి ఫలకాలను రూపొందించే పనులు చేపట్టారు. గర్భాలయంలో మహా ముఖ మండపం ఎదుట ధ్వజ స్తంభం, బలి పీఠం స్థాపన జరగాల్సి ఉంది. మహాబలిపురం నుంచి తీసుకువచ్చిన కలశాలను ఇటీవలే పరిశీలించి రాగి తొడుగులు తొడిగారు. బంగారు పూత వేసేందుకు చెన్నై తరలించారు. కలశాల తయారీకి మూడు వేల ఎనిమిది వందల కిలోల రాగి, ఇత్తడి లోహాలను వాడుతున్నారు. తొలి ప్రాకారంలో లోపలి వైపు సింహం రూపాలతో కూడిన యాలి విగ్రహాల నిర్మాణాలు చేపట్టారు. రెండో ప్రాకారం వెలుపలి వైపు ద్వారపాలకులు, సాలహారాలు నిర్మిస్తున్నారు.

నాలుగు వేల మంది సేద తీరేందుకు హాల్ నిర్మాణం

పట్టణం మీదుగా కొండపైకి వెళ్లేందుకు మెట్ల దారి నిర్మిస్తున్నారు. మెట్ల దారిలో రాజగోపుర నిర్మాణం సాగుతోంది. బ్రహ్మోత్సవాల వంటి ప్రధాన వేడుకలకు వచ్చే భక్తుల కోసం యాదాద్రి ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. భక్తులు నాలుగు వేల మంది వరకు సేద తీరే విధంగా పనులు జరుగుతున్నాయి. స్వామి దర్శనానికి వచ్చే వీవీఐపీల కోసం ప్రెసిడెన్షియన్ సూట్ నిర్మాణాలు సాగుతున్నాయి.

భూగర్భ పైపు లైను ద్వారా గర్భగుడికి ఏసీలను అనుసంధానిస్తుండగా శివాలయం పక్కన మెట్ల మార్గం వైపు, ఏసీల కోసం ప్రత్యేక ప్లాంటు నిర్మిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం, ఆలయ నగరి కోసం 1800 కోట్లు అవసరమని అంచనా. భక్తుల వసతి సముదాయాల్ని దాతల విరాళాలతో చేపట్టడం ద్వారా వ్యయం 1200 కోట్లకు పరిమితమైంది.

శివాలయం సైతం కృష్ణశిలతోనే నిర్మాణం

ప్రధానాలయం మాదిరిగానే శివాలయం సైతం కృష్ణశిలతోనే నిర్మిస్తున్నారు. శివాలయంతోపాటు త్రితల రాజగోపురం, ముఖ మండపం, పార్వతీదేవి మందిరానికి కృష్ణ శిలల్నే వాడుతున్నారు. ఇదే ఆవరణలో నిర్మిస్తున్న గణపతి, ఆంజనేయస్వామి, నవగ్రహాల ఆలయాలతోపాటు యాగశాలను సిమెంటుతో నిర్మిస్తున్నారు. శివాలయం సాలహారాలలో అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అమర్చాలని స్తపతులు నిర్ణయించారు. ఇలా అపురూప నిర్మాణాలతో యాదాద్రి ఆలయం అతి కొద్ది కాలంలోనే భక్తులను తన్మయత్వంలో ఒలలాడించనుంది.

ఇవీ చూడండి : మున్సిపల్​ ఎన్నికల సమన్వయకర్తలను నియమించిన ఉత్తమ్

sample description
Last Updated : Jul 10, 2019, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.