ETV Bharat / state

దళిత మహిళా సర్పంచ్​కు అవమానం.. నిరసనగా ధర్నా

దళిత మహిళా సర్పంచ్​ని అవమానపరిచిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు.

Women Sarpanch And Dalit Organisations Protest In Yadadri Bhuvanagiri District
దళిత మహిళా సర్పంచ్​కి అవమానం.. దళిత సంఘాల ధర్నా!
author img

By

Published : Jul 19, 2020, 4:07 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు మండలం ముత్తిరెడ్డి గూడెం సర్పంచ్ ఆడెపు విజయను అదే గ్రామానికి చెందిన శశిధర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అవమానపరిచారని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. కేసు నమోదైనా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పోలీసులను ప్రశ్నించారు. ఈ ధర్నాలో దళిత నాయకులు, కార్యకర్తలు, ఐద్వా నాయకులు పాల్గొన్నారు.

తనను అవమానించిన నిందితులపై గతనెలలో మోటకొండూర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశానని.. జులై 4 న ఎఫ్​ఐఆర్ కూడా నమోదైందని, 6వ తారీఖున ఏసీపీ గ్రామంలో విచారణ చేశారని, 9 మంది సాక్ష్యం కూడా చెప్పారని.. అయినా పోలీసులు వారి మీద చర్యలు తీసుకోవడం లేదని సర్పంచ్​ ఆడెపు విజయ ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదై 15 రోజులవుతున్నా ఇప్పటివరకు నిందితుడు శశిధర్ రెడ్డిని అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ, ఆమె దళిత సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.

వెంటనే నిందితులని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేసు విషయంలో రాజీకి రావాలని మధ్యవర్తులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారని విజయ ఆరోపించారు. ప్రజలతో ఎన్నుకోబడిన తనను.. అగ్రకులాల వ్యక్తులు అవమాన పరిచారని విజయ కన్నీరు పెట్టుకున్నారు.

ఇదీ చూడండి:- 'కరోనా వేళ ఎన్నికల నిర్వహణకు సూచనలు ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.