ఇవీ చూడండి:దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని కావాలి: రేవంత్
ఓటు అవగాహనకు నడుంకట్టిన స్వయంసేవక్ సంఘాలు - AVAGAHANA
సామాన్యుల చేతిలో వజ్రాయుధం ఓటు... అలాంటి ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలంటూ భువనగిరిలో స్వయం సేవక్ సంఘాలు అవగాహన కల్పించాయి.
అవగాహన ర్యాలీ...
భువనగిరిలో స్వయం సేవక్ సంఘాల ప్రతినిధులు ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పాలనాధికారి అనితా రామచంద్రన్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు సభ్యులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీవో కార్యాలయం నుంచి జగదేవ్పూర్ కూడలి వరకు ర్యాలీ ప్రదర్శించారు. ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ అనిత విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలందరూ నిర్భయంగా ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలతో పాటు పురపాలక సంఘం, మెప్మా ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని కావాలి: రేవంత్
TG_NLG_61_23_Voteravagaahanarally_AV_C14
రిపోర్టర్ - సతీష్ శ్రీపాద
సెంటర్ - భువనగిరి
జిల్లా - యాదాద్రి భువనగిరి
సెల్ - 8096621425
యాంకర్ : ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించుటలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఓటు హక్కు పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ ర్యాలీ ని జండా ఊపి ప్రారంభించారు. అంతకు మునుపు అందరి తో ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీ ని భువనగిరి ఆర్.డి.ఓ కార్యాలయము నుండి జగదేవ్ పూర్ క్రాస్ రోడ్డు వరకు నిర్వహించారు. ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలందరూ నిర్భయంగా ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల తో పాటు పురపాలక సంఘం, మోప్మా ఉద్యోగులు పాల్గొన్నారు.