యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో బాధిత కుటుంబాలను కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 5 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు.
హాజీపూర్ నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి కోర్టు ఉరిశిక్ష విధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా ఉరిశిక్ష అమలయ్యేలా న్యాయవ్యవస్థ కృషి చేయాలన్నారు. నిందితుడికి ఉరిశిక్ష పడేలా చిత్తశుద్ధితో పనిచేసిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు, పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: బావను కత్తితో పొడిచిన బావమరుదులు