ఆర్టీసీ సమ్మెలో భాగంగా భాగంగా యాదగిరిగుట్టలో బస్సు డిపో ముందు బైఠాయించి కార్మికులు నిరసన తెలిపారు. ఉన్నట్టుండి ఓ కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. స్పందించిన తోటి కార్మికులు అతడిని పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి కారణంగానే మనోవేదన చెంది బాధితుడు అస్వస్థతకు గురయ్యాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి బస్సుల రాకపోకలను అధికారులు చేపట్టారు.
ఇదీ చూడండి : 'రాయాల్సింది సూసైడ్‌నోట్ కాదు... తెరాసకు మరణ శాసనం'