యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావటం వల్ల.. భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులు స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
స్వామివారి ధర్మ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున.. అధికారులు వాహనాలను కొండపైకి అనుమతించడంలేదు. ఆలయ ముఖ మండపంలో జరుగుతోన్న అష్టోత్తర పూజలు, బాలాలయంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణాలు, కొండ కింద నిర్వహిస్తున్న సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొంటూ.. మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఇదీ చదవండి: ప్రమాదకర విన్యాసాలు చేసి... స్టంట్ ఉమెన్‌గా మారి