తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు వైద్య సిబ్బంది రక్షణ కోసం తయారు చేసిన మాస్కులను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు అందజేశారు. అత్యంత నాణ్యత ప్రమాణాలతో సిద్ధం చేసిన మాస్కులు కరోనా వైరస్ సోకకుండా కాపాడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, తెలంగాణ డాక్టర్ల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అన్వేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ నవ్య ప్రకాష్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 24 గంటల్లో దేశంలో 62 కరోనా మరణాలు