యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి, సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)కు వ్యతిరేకంగా ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) పునరుద్ధరించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి నూతనకల్ తహసీల్దార్ జమీరొద్దీన్ ద్వారా వినతిపత్రం అందజేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి కోరారు.
ఇవీచూడండి: యువకుడి మృతి... కార్పొరేటర్‌పై బంధువుల దాడి