టీ వెంచర్ నిర్వాహకులు తమ భూమిని ఆక్రమించేందుకు యత్నించారని యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామానికి చెందిన రైతులు మంగ సత్యనారాయణ, యాదగిరి, రాములు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులతో రాత్రికి రాత్రే పొలాన్ని విచ్ఛిన్నం చేసి ప్లాట్లుగా మారుస్తున్నారని పేర్కొన్నారు. కొంతమంది గ్రామస్థులతో కలిసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మరికొంత మంది స్థానికులు ఘటన స్థలానికి రావడం వల్ల అక్కడి నుంచి వారు పారిపోయారని బాధితులు తెలిపారు.
వారి అండదండలతోనే...
వెంచర్‌ను అనుకొని ఉన్న 28 ఎకరాల భూమిపై కన్నేసిన వెంచర్ నిర్వాహకులు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారని, వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశామని బాధిత రైతులు తెలిపారు. ఇరువురు కూర్చొని మాట్లాడుకోవాలని ఏసీపీ, సీఐ సూచించినప్పటికీ వారు రాత్రికి రాత్రే భూమిని ఆక్రమించేందుకు యత్నించారని పేర్కొన్నారు. కక్ష్యసాధింపు చర్యల్లో భాగంగానే అధికార పార్టీ నాయకులు, పోలీసుల అండదండలతోనే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని సంబంధిత రైతులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: 'కోజికోడ్ విమానాశ్రయ రన్‌వే సురక్షితమైనదే'