Teachers Suspend in Yadadri: భువనగిరి జిల్లాలో విధుల పట్ల అలసత్వం ప్రదర్శించిన ఇద్దరు ఉపాధ్యాయులని జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి సస్పెండ్ చేశారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 8న విద్యార్థినులు తినుబండారాలు కొనుక్కోవడానికి కిరాణా షాపుకి వెళ్లారు. ఆసమయంలో కొట్టు యజమాని లింగప్ప విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు.
అయినప్పటీకీ వారు పైఅధికారులకు తెలపకుండా గోప్యంగా ఉంచారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు లింగప్పపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కి పంపారు. ఈ విషయంపై అంతర్గత విచారణ జరిపిన విద్యాశాఖ విద్యార్థినులు పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఉపాధ్యాయులకు తెలిపినప్పటికీ వారు స్పందించటం లేదని తేల్చింది. దీంతో రమాదేవి, రేణుకాదేవిని సస్పెండ్ చేస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చదవండి: