యాదాద్రి భువనగిరి జిల్లా సూరేపల్లి పరిధిలోని ఆకుతోటబావి తండాలో అక్రమ సారా తయారీ కేంద్రంపై భువనగిరి ఎస్ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు. 10 లీటర్ల నాటుసారాతో పాటు బెల్లం పానకం, 5గురు నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. నిందితులు అదే తండాకి చెందిన కెతావత్ లక్ష్మణ్, కెతావత్ ఉనమ్మ, కెతావత్ శ్రీను, కెతావత్ సాలమ్మ, కెతావత్ మహేశ్‌గా పోలీసులు గుర్తించారు. వీరందరిని భువనగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: కరోనాపై పోరుకు కృతజ్ఞతగా యోధులపై పూలవర్షం